‘ఎఫ్ 2’ సక్సెస్‌మీట్‌లో అభిమాన సంఘాల గురించి వరుణ్‌తేజ్ మాట్లాడాడు. వివాదాస్పద వ్యాఖ్యలు ఏమీ చేయడలేదు. వెంకటేశ్ గురించి చెప్పే క్రమంలో హీరోలకు ఫ్యాన్స్ గ్రూపులు ఉంటాయని చెప్పి వదిలేశాడు. ‘‘ప్రేక్షకులు ‘నాకు ఈ హీరో ఇష్టం. నాకు ఈ హీరో ఇష్టం’ అని చాలా గ్రూపులు, ఏవేవో ఉంటాయి. అయితే ప్రేక్షకుల అభిమాన హీరో ఎవరైనా… వాళ్లందరికీ కామన్‌గా నచ్చే హీరో విక్టరీ వెంకటేశ్‌గారు. ఎవరి అభిమానికి అయినా నచ్చే హీరో ఆయన’’ అని వరుణ్‌తేజ్ అన్నాడు. వెంకటేశ్‌గారి పక్కన ఎలా నటించాలోనని భయపడుతుంటే ఓ బ్రదర్‌లా ఆయన తనకు చాలా సపోర్ట్ ఇచ్చారని అన్నాడు. ఆయన్నుంచి చాలా స్ఫూర్తి పొందానని అన్నాడు. వెంక ‘‘చిరంజీవిగారు నాకు పెదనాన్న కావొచ్చు. వెంకీగారు మాత్రం నాకు కో బ్రదరే. నా బెస్ట్ ఫ్రెండే’’ అని వరుణ్ వ్యాఖ్యానించాడు. విజయం అందించిన ఉత్సాహంలో ‘ఎఫ్ 3’ని కూడా ప్రకటించాడు. ‘ఎఫ్ 2’ విడుదలైన తరవాత ఇచ్చిన ఇంటర్వ్యూలలో సీక్వెల్ తీయాలనుందని వ్యాఖ్యానించిన దర్శకుడు అనిల్ రావిపూడి, తప్పకుండా ‘ఎఫ్ 3’ చేస్తానని మరోసారి సక్సెస్‌మీట్‌లో తెలిపాడు.