అక్కినేని కోడలు కాకముందు కథల ఎంపికలో సమంత ఆలోచనా విధానం ఒకలా వుంటే, అక్కినేని కోడలు అయిన తరవాత మరోలా వుందని సినిమా సర్కిళ్లలో వినిపిస్తున్న మాట. గతంలో కమర్షియల్ సినిమాలు చేయడానికి ఏమాత్రం ఆలోచించని సమంత, ఇప్పుడు కథాబలమున్న సినిమాలకు సంతకం చేసే ముందు, చేయడానికి ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం సమంత ‘మజిలీ’, కొరియన్ సినిమా ‘మిస్ గ్రానీ’ రీమేక్ ‘ఓ బేబీ ఎంత సక్కగున్నావే’ సినిమాల్లో నటిస్తున్నారు. ఈ రెండూ గత యేడాదికి ముందు నుంచి చర్చల్లో వున్నవే. ఇవి కాకుండా పలు కథలు వింటున్నారు. ‘మహానటి’ విడుదల తరవాత ఇంచు ముందు ముప్ఫై కథలు విన్నారట సమంత. అందులో ఏదీ ఆమెకు నచ్చలేదని సమాచారం. ’96’ రీమేక్ ఒక్కటే చర్చల్లో వుంది. అందులో అక్కినేని కోడలు నటించడం దాదాపు ఖాయమే. ఇప్పుడు కథలో ఎంపికలో సమంత లెక్కలు చాలా అంటే చాలా మారాయని సినీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఏదో ఒక సినిమా చేయాలని సమంత అనుకోవడం లేదు. గొప్ప కథల్లో, కథాబలమున్న చిత్రాల్లో, తనకు పేరు తీసుకొచ్చే పాత్రల్లో నటించాలని ఆమె భావిస్తున్నార్ట. స్ట్రయిట్ తెలుగు కథతో సమంతను ఎవరు ఒప్పిస్తారో చూడాలి.