ముస్లింలు బీజేపీకి వ్యతిరేకమేమో కానీ… ముస్లిం నేతలు మాత్రం కాదు. ముస్లిం నేతలకు బీజేపీనే బలం. దానికి అసదుద్దీన్ ఓవైసీనే సాక్ష్యం. మజ్లిస్ ఇత్తెహదుల్ ముస్లిమీన్ … అలియాస్ ఎంఐఎంగా…. ప్రసిద్ధి చెందిన పార్టీకి అసదుద్దీన్ అధినేత. ఈయన పైకి.. బీజేపీని తీవ్రంగా విమర్శిస్తూంటారు. అసలు బీజేపీపై పోరాడటానికే పుట్టామన్నట్లుగా ఉంటారు. వ్యక్తిగతంగా బీజేపీ నేతలపై దూషణలు చేస్తూంటారు. ఇలా చేయడం వల్ల బీజేపీతో పోరాడుతున్న భావన కల్పించి.. తన వంతుగా.. ఓట్లు సాధిస్తూ ఉంటారు. కాని నిజానికి ఆయన చేసేది .. బీజేపీతో దోస్తీ. అదే చాలా రోజులుగా సాగుతోంది. ఇప్పుడు బహిరంగమవుతోంది. ముస్లింలను ఓట్లను చీల్చడానికి ఎంఐఎం ఇటీవలి కాలంలో.. ఎక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరిగినా పోటీ చేసింది. ముస్లిం ఓటర్లు సంప్రదాయంగా..కాంగ్రెస్ పార్టీ ఓటర్లు. చాలా చోట్ల.. రెండు, మూడు శాతం ఓట్లు .. మజ్లిస్ చీల్చుకున్నా..అది కాంగ్రెస్ పార్టీకి పెద్ద దెబ్బే. బీజేపీకి లాభమే. అయినా సరే.. మహారాష్ట్ర నుంచి అసోం వరకూ.. అనేక రాష్ట్రాల్లో పోటీ చేసి… కాంగ్రెస్ ఓటములకు కారణం అయింది. అంత కంటే ఎక్కువగా.. బీజేపీకి లాభం చేసింది.
ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో.. కాంగ్రెస్ పార్టీకి, దాని మిత్రపక్షాలను వీలైనంతగా దెబ్బ తీయడానికి అసదుద్దీన్ ఓవైసీని బీజేపీ దేశవ్యాప్తంగా వాడుకుంటోంది. ముస్లింలు బలంగా ఉన్న నియోజకవర్గాల్లో ఓట్ల చీలక కోసం.. అసదుద్దీన్‌నే పాచికగా వాడుతోంది. కారణం ఏదైనా.. బీజేపీకి ఎక్కడ అవసరమో… అసదుద్దీన్ అక్కడ వాలిపోతున్నారు. ఓ రేంజ్‌లో దారుణమైన విమర్శలు చేస్తూ.. ముస్లింలను రెచ్చగొట్టి.. తన ఓటు బ్యాంక్‌ను పెంచుకుని.. కాంగ్రెస్‌ను దెబ్బతీయాలనే వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. బీజేపీ ఈ సారి… రాహుల్, సోనియాల నియోజకవర్గాలు అమేథీ, రాయ్‌బరేలిలపై దృష్టి పెట్టింది. అక్కడ ముస్లింలు గణనీయ సంఖ్యలో ఉన్నారు. ఎస్పీ, బీఎస్పీ పోటీ చేయడం లేదు. వారు కాంగ్రెస్‌కే మద్దతిస్తున్నారు. ఈ సమయంలో… అక్కడ ముస్లిం ఓట్లను చీలిస్తే… వారిని ఓడించవచ్చని బీజేపీ ప్లాన్ వేసింది. బీజేపీ కోసం అసదుద్దీన్ రంగంలోకి దిగారు. అక్కడ ప్రజల్ని మరింత రెచ్చగొడతానని.. ఏం చేసుకుంటరో చేసుకోండని… అసదుద్దీన్ నేరుగానే సవాళ్లు విసురుతున్నారు.
కొద్ది రోజుల క్రితం… జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా ఏపీకి వచ్చి ప్రచారం చేస్తానని.. చంద్రబాబుకు వార్నింగ్ కూడా ఇచ్చారు అసదుద్దీన్ ఓవైసీ. ఇప్పుడు… యూపీపై దృష్టి పెట్టారు. ముందు ముందు మహారాష్ట్రపైనా ఆయన ఎక్కువ కాన్‌సన్‌ట్రేట్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే.. అక్కడ శివసేన బీజేపీని డంప్ చేయబోతోంది. హిందూ ఓట్లను పోలరైజే చేసి.. బీజేపీ వైపు పంపాలంటే.. వారికి అసదుద్దీన్ అవసరం. ఎక్కడైనా.. బీజేపీని శత్రువుగా పరిగణిస్తే.. ఓడించాలనుకుంటారు. కానీ.. బీజేపీని శత్రువుగా చూస్తూ ఆ పార్టీని గెలిపించాలనుకుంటున్నారు అసదుద్దీన్. దీనికి కారణం .. అధికార పార్టీకి ఉపయోగపడితే… ఆర్థిక ప్రయోజనాలు కలగడం మాత్రమే కాదు… బీజేపీ ఎంత బలంగా ఉంటే.. మత వాదం అంత బలంగా ఉంటుంది.. మత వాదం ఉంటేనే మజ్లిస్‌కు మనుగడ ఉంటుంది. మొత్తానికి బీజేపీ, మజ్లిస్… రాజకీయాలకు కొత్త దారి చూపిస్తున్నట్లుగా ఉన్నాయి.