తెలుగు రాష్ట్రాల భారతీయ జనతా పార్టీ నేతలు హఠాత్తుగా.. రాజ్‌భవన్ లో ప్రత్యక్షమయ్యారు. తిరుమల తిరుపతి దేవస్థానాల్లో అక్రమాలు జరుగుతున్నాయని.. ఉన్న పళంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఓ వినతి పత్రం ఇచ్చారు. నిజానికి .. అమిత్ షాను రమణదీక్షితులు కలిసిన తర్వాత రగిలిన రగడ.. తర్వాత సద్దుమణిగిపోయింది. కొన్నాళ్లుగా ప్రశాంతంగా… ఉంది. అయినా భారతీయ జనతా పార్టీ నేతలు ఏదో ఉపద్రవం ముంచుకొచ్చినట్లుగా.. గవర్నర్ కు ఎందుకు ఫిర్యాదు చేశారన్నది ఆసక్తికరంగా మారింది. గవర్నర్ కు ఏం చెప్పారో కానీ.. బయటకు వచ్చి మాత్రం.. బ్లాక్ లో టిక్కెట్లు అమ్ముతున్నారని.. దీనిపై టీటీడీ చర్యలు తీసుకోవడం లేదని అందుకే గవర్నర్ కు ఫిర్యాదు చేశామని చెప్పుకొచ్చారు.టీటీడీలో రోజు రోజుకు అవినీతి పెరిగిపోతోందని చెప్పుకొచ్చారు. విజిలెన్స్,ఈడీని విచారణకు ఆదేశించాలని గవర్నర్‌ను కోరామంటున్నారు.
నిజానికి తిరుమలలో టిక్కెట్ల దందా ఇటీవలి కాలంలో పూర్తిగా తగ్గిపోయింది. పూర్తిగా ఆన్ లైన్ చేయడంతో.. వీఐపీ సిఫార్సు లేఖల ద్వారా కూడా టిక్కెట్లు పొందం.. కనాకష్టంగా మారింది. గతంతో పోలిస్తే.. చాలా వరకు.. టిక్కెట్లు అక్రమాలు తగ్గిపోయాయి. అయినప్పటికీ. బీజేపీ నేతలు.. దీన్నే ఎందుకు కారణంగా చేసుకుని.. గవర్నర్ కు ఎందుకు ఫిర్యాదు చేశారో.. ఇతర పార్టీల నేతలుక అర్థం కావడం లేదు. బేసిగ్గా బీజేపీ రాజకీయం.. దేవుళ్ల మీదే ఉంటుంది. దానికి శబరిమల ఇష్యూనే ఉదాహరణ. హిందూత్వం పేరుతో.. దేవుడ్నే… రోడ్డుకు ఈడ్చి.. కేరళలో కర్ఫ్యూ విధించేంత పరిస్థితులు తెచ్చారు. గతంలో రమణదీక్షితులతోనూ.. బీజేపీ తీవ్రమైన ఆరోపణలు చేయించి.. రచ్చ రచ్చ చేసింది. .. ఆ ఇష్యూని ప్రజల సెంటిమంట్ గా మార్చే ప్రయత్నం చేసి విపలమయింది.
ఆ తరహాలోనే.. ఇప్పుడు తిరుమల వేదికగా… బీజేపీ కొత్త వ్యూహం ఏమైనా పన్నుతుందేమోనన్న అనుమానాలు తాజాగా… బీజేపీ నేతల రాజ్ భవన్ పర్యటనతో వస్తున్నాయని.. టీడీపీ నేతలు అంటున్నారు. అసలు ఏమీ జరగకుండా… బ్లాక్ టిక్కెట్ల ఇష్యూతోనే గవర్నర్ కు ఫిర్యాదు చేయాల్సిన అవసరం ఏముందన్నది టీడీపీ నేతల అనుమానం. తెలుగు రాష్ట్రాల బీజేపీ నేతల రాజ్ భవన్ టూర్ వెనుక అసలు కథేమిటో వాళ్లు చెబితేనే బయటకు తెలియాలి.