కీర్తి సురేష్ చెన్నైలో ఓ ఖరీదైన ఫ్లాట్ కొనుక్కుంది. కీర్తి సాధిస్తున్న విజయాలు, వస్తున్న ఆఫర్లు, అందుకుంటున్న పారితోషికాలు లెక్కగడితే.. కీర్తి ఫ్లాట్ కొనడం పెద్ద విచిత్రంగా ఏమీ అనిపించదు. కాకపోతే… ఈ ఫ్లాట్ తనకు బహుమానంగా వచ్చిందని చెన్నై వర్గాలు కోడై కూస్తున్నాయి. ఓ అగ్ర కథానాయకుడు కీర్తికి ఫ్లాట్ ని బహూకరించాడని టాక్. ఆ కథానాయకుడిగా తమిళంలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇద్దరూ కలసి ఓ సినిమా కూడా చేశారు. ఆ ప్రేమతోనే కీర్తికి ఈ ఫ్లాట్ కొనిచ్చాడన్న వార్తలు గుప్పుమంటున్నాయి. గతంలో సదరు కథానాయకుడు మరో ‘తార’కీ ఇలానే ఫ్లాట్ కొనిచ్చాడట. అప్పట్లో ఆ వార్త కూడా ఇలానే చక్కర్లు కొట్టింది. హైదరాబాద్‌లో రాశీఖన్నా ఓ ఫ్లాట్ కొనుక్కుంది. రకుల్ కూడా అంతే. వీరిద్దరూ సొంత ఇల్లు కొనుక్కున్నప్పుడు కూడా ఇలాంటి రూమర్లే బయటకు వచ్చాయి. ‘అది నా కష్టార్జితం. ఈ ఫ్లాటు కొనుక్కోవడంలో ఎవరి ప్రమేయం లేదు’ అని స్వయానా ఆ కథానాయికలు గోడు వెళ్లగక్కుకోవడంతో పుకార్లు తగ్గాయి. మరి కీర్తి సురేష్ కూడా అదే పాట పాడుతుందా? లేదంటే ఎందుకొచ్చిన గొడవ అనుకుని కామ్‌గా ఉంటుందా?? వెయిట్ అండ్ సీ.