అక్కినేని ఫ్యామిలీ అంతా వెల్ ప్లాన్డ్ గా వుంటారు. ఆ రోజుల్లో అక్కినేని నాగేశ్వరరావు హీరోగా చేస్తూనే రైస్ మిల్లులు, కలప వ్యాపారం వగైరా చేపట్టారు. ఆ తరువాత స్టూడియో, సినిమా నిర్మాణాలు తెలిసినవే. నాగార్జున హయాంలో రియల్ ఎస్టేట్, రెస్టారెంట్లు, ఇతరత్రా వ్యాపారాలు చేపట్టారు.
ఇప్పుడు నాగ్ చైతన్య కూడా ఇదే దారిలో పయనిస్తున్నాడు. తన స్వంతంగా ఇటీవల స్టూడియోలో ఓ వింగ్ స్టార్ట్ చేసుకున్న సంగతి తెలిసిందే. లేటెస్ట్ గా విశాఖలో రియల్ ఎస్టేట్ పెట్టుబడులు కూడా స్టార్ట్ చేసినట్ల బోగట్టా.
విశాఖలో రిమోట్ ప్రాంతాల్లో అయినా సరే, కాస్త తక్కువగా వచ్చే భూములు కాస్త పెద్ద సంఖ్యలో కొనే ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ముందుగా కొద్ది కొద్దిగా స్టార్ట్ చేసినట్లు బోగట్టా. మొత్తం మీద ఓ పక్క సినిమాలు చేస్తూనే, వస్తున్న ఆదాయాన్ని అంతకు అంతా పెంచే మార్గాలు నాగ్ చైతన్య బాగానే అన్వేషిస్తున్నాడన్నమాట.