అఖిల్ అక్కినేని హీరోగా నటించిన తాజా సినిమా ‘మిస్టర్ మజ్ను’. మరో రెండు రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఆల్రెడీ విడుదలైన ట్రైలర్ ‘ఆరెంజ్’ తరహాలో ఉందని విమర్శలు ఎదుర్కొంటోంది. అయితే అఖిల్ అక్కినేని ఎయిట్ ప్యాక్ స్టిల్ ప్రేక్షకులను ఆకర్షించింది. హీరో ఇంట్రడక్షన్ సాంగ్ కోసమే ఎయిట్ ప్యాక్ చేశానని అఖిల్ చెప్పాడు. ఎయిట్ ప్యాక్ చేయాలనే ఐడియా కూడా తనది కాదని, కొరియోగ్రాఫర్ శేఖర్ అడగడం తోనే చేశానని తెలిపాడు. ఈనెల 25న సినిమా విడుదలవుతున్న సందర్భంగా తెలుగు మీడియాకు అఖిల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇంటర్వ్యూలో ఎయిట్ ప్యాక్ గురించి మాట్లాడుతూ “మిస్టర్ మజ్ను యాక్షన్ సినిమా కాదు. రొమాంటిక్ సినిమా. చాలా వినోదాత్మకంగా ఉంటుంది. అయితే హీరో ఇంట్రడక్షన్ సాంగులో ఎయిట్ ప్యాక్ చేస్తే బాగుంటుందని శేఖర్ మాస్టర్ నన్ను కన్విన్స్ చేశారు. మొదట నేను ఒప్పుకోలేదు. ఆయన అడగడంతో ఎయిట్ ప్యాక్ చేశా. ఆ సాంగును శేఖర్ మాస్టర్ చాలా డిఫరెంట్ గా కొరియోగ్రఫీ చేసారు. ప్రేక్షకులకు నచ్చుతుందని ఆశిస్తున్నా” అని అఖిల్ అన్నారు. సంక్రాంతికి వచ్చిన సినిమాలలో వినోదాత్మక సినిమా ఎఫ్ 2 విజయం సాధించిందని, మిస్టర్ మజ్ను కూడా అటువంటి చిత్రమేనని, ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని కోరుకుంటున్నట్లు అఖిల్ అన్నారు.