లవర్స్ డే ఫిబ్రవరి 14న ‘లవర్స్ డే’ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తుంది. ఒక్క కంటిసైగతో భాషాబేధం లేకుండా భారతీయ ప్రేక్షకులను బుట్టలో వేసుకున్న ప్రియా ప్రకాష్ వారియర్ నటించిన మలయాళ చిత్రం ‘ఒరు అడార్ లవ్’కి తెలుగు అనువాదం ‘లవర్స్ డే’. ఫిబ్రవరి 14న చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తున్నా.. ఆడియోలో ఈవెంట్ బుధవారం సాయంత్రం నిర్వహించారు. యాంకర్ సుమ ఈ కార్యక్రమంలో ద్విపాత్రాభినయం చేశారు. సుమ స్థానంలో మరొకరిని ఈ కార్యక్రమం వ్యాఖ్యాతగా ఊహించుకోవడం కష్టమే.
సుమ వ్యాఖ్యాతగా వ్యవహరించడమే కాదు.. వేదికపై ట్రాన్స్‌లేటర్ అవతారంలో దర్శక నిర్మాతలకు సహాయ పడ్డారు. అంతా కొత్త తారలతో తెరకెక్కిన మలయాళ చిత్రం ‘ఒరు అడార్ లవ్’. చిత్ర దర్శకుడు ఒమర్ లులు, మలయాళ నిర్మాతకు తెలుగు రాదు. ఇంగ్లిష్ లో అంత ప్రావీణ్యం లేదు. మలయాళంలో మాట్లాడారు. ఆ మాటలను సుమ తెలుగులో అనువదించారు. తెలుగు నటుడు రాజీవ్ కనకాలను పెళ్లి చేసుకుని, తెలుగు గడ్డపై సెటియాలైన మలయాళీ సుమ. ఆమె మాతృభాష మలయాళీ కావడం ‘లవర్స్ డే’ దర్శక నిర్మాతల వరం అనే అనుకోవాలి. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా వచ్చారు. వేదికపై ఓ పాటకు ప్రియా ప్రకాష్ వారియర్, ఇతర నటీనటులు కొన్ని క్షణాలు డాన్స్ చేసి సందడి చేశారు.