సార్వత్రిక ఎన్నికలకు ముందు.. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ.. ఎవరూ ఊహించని ఎత్తుగడ వేశారు. ప్రియాంకా గాంధీని తెరపైకి తెచ్చి…ఓ కలకలం రేపారు. ఒక్కసారిగా… ఊహించని విధంగా ప్రియాంక తెరపైకి రావడం.. దేశ రాజకీయాల్లో కలకలంలా మారింది. బీజేపీలో ప్రధాని నుంచి కింది స్థాయి నేతల వరకూ.. స్పందించడంతో.. ప్రియాంక ప్రత్యక్ష రాజకీయాల ప్రవేశ అంశం… జాతీయ స్థాయికి చేరింది. మొత్తంగా.. ఓ పాజిటివ్ వేవ్ తెచ్చి పెట్టింది. దేశ రాజకీయాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. విస్తృతంగా చర్చ జరుగుతోంది. ప్రియాంక కాంగ్రెస్ పార్టీని ఎలా కాపాడబోతున్నారో.. సామాన్యులు కూడా చర్చించుకుంటున్నారు. రాహుల్ గాంధీ కోరుకున్నది కూడా ఇదే. అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతోంది.
ప్రియాంక రాకకోసం పార్టీ శ్రేణులు ఎంతగానో ఎదురు చూశాయి. ఆ రోజు రానే వచ్చింది. ఇప్పుడామె పార్టీ ప్రధాన కార్యదర్శి అయ్యారు. ఆమెను తూర్పు ఉత్తరప్రదేశ్‌కే పరిమితం అని అని బాధ్యతలు ఇచ్చినా ఆ ప్రభావం దేశం మొత్తం ఉండటం ఖాయమే. ఈ విషయాన్ని రాజకీయ నిపుణులు కూడా చెబుతున్నారు. చాలా కాలం పాటు… రాజకీయ వ్యూహకర్తగా పార్టీలకు సేవ చేసి .. ఇటీవలే జేడీయూలో చేరిన ప్రశాంత్ కిషోర్ కూడా.. ప్రియాంక ప్రత్యక్ష రాజకీయాల్లో ఎంట్రీ లెక్క మారుస్తుందని చెబుతున్నారు. పార్టీ పట్ల ప్రజల్లో నమ్మకం పెరుగుతుందని ఆయన అంటున్నారు. ఒక్క పీకే అభిప్రాయం మాత్రమే కాదు.. బీజేపీ ముఖ్యనేతల అభిప్రాయం కూడా అదే. అందుకే.. బీజేపీలోని అన్ని స్థాయిల నేతలు.. ప్రియాంక ఎంట్రీపై స్పందించారు.
ఎవరు ఔనన్నా.. కాదన్నా… భారత రాజకీయాల్లో ఏదైనా పార్టీ గెలవాలంటే.. ఆ పార్టీకి బలమైన నాయకత్వం ఉండాలి. ఛర్మిష్మా ఉన్న నేత ఉండాలి. భారతీయ జనతాపార్టీకి గత ఎన్నికల్లో నరేంద్రమోడీ రూపంలో ఆ చరిష్మా ఉన్న నేత దొరికారు. సోషల్ మీడియా హవా ప్రారంభంలోనే..దాన్ని చక్కగా ఉపయోగించుకోవడంతో.. ఆ చర్మిషా వచ్చి ఉండవచ్చు. కానీ పలితం మాత్రం వచ్చింది. ఇప్పుడా అవకాశం కాంగ్రెస్ పార్టీ తలుపు తట్టినట్లుగా ఉంది. ప్రియాంకా గాంధీకి రూపురేఖలు మాత్రమే కాదు.. ఆమె తల్లి, సోదరుని నియోజకవర్గాల్లో ఇప్పటికే రాజకీయాల్ని శాసించారు. తన రాజకీయ చాణక్యతను ప్రదర్శించారు. గత ఎన్నికల్లో యూపీ మొత్తం.. బీజేపీ మినహా ఇతర పార్టీలు తుడిచి పెట్టుకుపోయినా.. చివరికి బీఎస్పీ జీరో అయినా… రాయ్ బరేలీ, అమేధీల్లో… కాంగ్రెస్ విజయం సాధించిందంటే.. ఆమె నాయకత్వమే కారణం. అందుకే… ప్రియాంక ప్రత్యక్ష రాజకీయ ప్రవేశం.. కాంగ్రెస్ పార్టీపై ఓ పాజిటివ్ బజ్ తీసుకొచ్చింది. ఇది ఎన్నికల వరకూ కొనసాగితే.. ఎవరూ ఊహించనంత మైలేజీ.. కాంగ్రెస్‌కు వచ్చే అవకాశం ఉంది.