అఖిల్ అక్కినేని హీరోగా నటించిన తొలి సినిమా ‘అఖిల్’ 2015 నవంబర్ నెలలో విడుదలైంది. రెండో సినిమా ‘హలో’ 2017 డిసెంబర్ నెలలో ప్రేక్షకుల ముందుకొచ్చింది. రెండు సినిమాల మధ్య రెండేళ్ల గ్యాప్ తీసుకున్నాడు. రెండో సినిమాకి, మూడో సినిమా ‘మిస్టర్ మజ్ను’కి మధ్య యేడాది గ్యాప్ వుంది. ఈసారి మాత్రం ఎక్కువ గ్యాప్ తీసుకోనని అఖిల్ అంటున్నాడు. హీరోగా తన నాలుగో సినిమాను దసరాకు విడుదల చేస్తానని చెబుతున్నాడు.
‘మిస్టర్ మజ్ను’ విడుదల హడావుడిలో వున్న అఖిల్ కొత్త సినిమా వివరాలను ఫిబ్రవరిలో ప్రకటిస్తానని తెలిపాడు. దాన్ని ఐదారు నెలల్లో పూర్తి చేసి దసరాకు విడుదల చేయాలనుకుంటున్నట్టు చెప్పాడు. అఖిల్ కోసం ఇద్దరు ముగ్గురు దర్శకులు ఎదురు చూస్తున్నారు. దర్శకుడు రవిరాజా పినిశెట్టి తనయుడు సత్య ప్రభాస్ దర్శకత్వంలో అఖిల్ ఓ సినిమా చేసే అవకాశాలు ఉన్నాయని ఎప్పట్నుంచో వినిపిస్తున్న వార్త. అఖిల్, సత్య ప్రభాస్ మధ్య చాలాసార్లు సిట్టింగులు జరిగాయి. ఆ సినిమా వుంటుందో లేదా మరో సినిమా చేస్తాడో? ఏ సినిమా చేసినా దసరాకు రావడం మాత్రం ఖాయమే.