అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కాంబినేషన్లో ఓ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఫిబ్రవరి 14 నుంచి ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. ఇప్పటి వరకూ ఈ సినిమాలో నటించే కథానాయిక ఎవరన్న విషయంలో ఇంకా ఓ క్లారిటీ రాలేదు. రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి గానీ, పక్కాగా ఎవరన్న విషయం తెలియలేదు. తన ప్రతీ సినిమాలోనూ హీరోయిన్ల విషయంలో బన్నీదే కీలక నిర్ణయం. డీజేలో పూజా హెగ్డే ఎంట్రీ ఇవ్వడానికి, నా పేరు సూర్య సినిమాలో అనూ ఇమ్మానియేల్ రాకకీ వెనుక బన్నీ నిర్ణయాలే పనడిచేశాయి.
అయితే ఇప్పుడు హీరోయిన్ల విషయంలో త్రివిక్రమ్ మాటే ఫైనల్ అని తెలుస్తోంది. తన సినిమా కాస్టింగ్ విషయంలో త్రివిక్రమ్ చాలా జాగ్రత్తలు తీసుకుంటుంటాడు. ఆఖరికి కమెడియన్లను ఎంచుకోవాలన్నా ఆచి తూచి ఆలోచిస్తాడు. ఇక హీరోయిన్ల విషయంలో అయితే ఇక చెప్పక్కర్లేద్దు. ఈసారీ త్రివిక్రమ్ మాటే ఫైనల్ కానుంది. బన్నీ కూడా `హీరోయిన్ల విషయం మీరే చూసుకోండి. మీరెవర్ని ఎంపిక చేసిన సరే` అంటూ ఆ బాధ్యతంతా త్రివిక్రమ్‌కి అప్పగించేశాడట. ఈ సినిమా హీరోయిన్ విషయంలో త్రివిక్రమ్ ఆల్రెడీ ఓ లిస్టుని తయారు చేసేసినట్టు వినికిడి. ఇది వరకు అటు బన్నీతోనూ, ఇటు త్రివిక్రమ్‌తోనూ పనిచేయని కథానాయికే ఉండబోతోందని సమాచారం. ఆమె ఎవరో తెలియాలంటే ఇంకొద్ది రోజుల్లు ఆగాలి.