” నా తండ్రి మరణం తట్టుకోలేక మరణించిన వాళ్లను ఓదార్చడానికి.. సోనియా పర్మిషన్ అక్కర్లేదు..ఆంక్షలు పెట్టారు.. అందుకే… కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పా. సోనియా అహంకారి.”
ఈ డైలాగ్ ఎవరన్నారో.. రాజకీయాలపై ఏ కొద్దిగా అవగాహన ఉన్న వారికైనా… ఇట్టే అర్థమైపోతుంది. ఇది వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిది.
” నా తండ్రి విగ్రహావిష్కరణకు కూడా జగన్ దగ్గర పర్మిషన్ తీసుకోవాలట. నా తండ్రి విగ్రహావిష్కరణకు ఆంక్షలు ఎందుకు.. అంతగా అవమానించాలా..?”
ఇది… అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెట్టిన పార్టీ నుంచి.. ఘోర అవమానాలకు గురై బయటకు వచ్చిన.. వంగవీటి రాధాకృష్ణ ఆవేదన.
అంటే.. జగన్.. తను ఏ కారణం చూపించి పార్టీ పెట్టుకున్నాడో.. అదే ఆత్మాభిమానం.. తన పార్టీలో ఇంకెవరికీ ఉండకూడదని అనుకుంటున్నారు. అనుకోవడం కాదు.. ఉంటే గింటే.. ఎలాంటి అవమానాలు ఎదురవుతాయో… చేసి చూపించారు. ఆ అవమానాలు తట్టుకోలేక.. వంగవీటి రాధాకృష్ణ ఒక్క సారిగా బరస్ట్ కావాల్సి వచ్చింది. మొత్తం మీడియా ముందు చెప్పుకుని.. గద్గద స్వరంతో.. చెప్పుకుని.. తన రాజకీయ జీవితంలో ఘోరంగా మోసపోయానని ఆవేదన చెందారు.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. తను కొత్తగా పార్టీ పెట్టుకున్న సమయంలో… అడిగిన వారకీ.. అడగని వారికీ ఓదార్పుయాత్రకు సోనియా పర్మిషన్ ఇవ్వలేదని.. ఆమెది ఢిల్లీ అహంకారమని చెప్పుకొచ్చారు. తను పార్టీ పెట్టుకోవడానికి ఇదో జస్టిఫికేషన్‌లా ఉండేది. నిజంగా… వైఎస్ మరణం తట్టుకోలేక అంత మంది చనిపోయారా.. అంటే.. ఒక్కరు కూడా.. అలా చనిపోవడానికి చాన్స్ లేదని… అందరికీ తెలుసు. కానీ తన సొంత పార్టీకి రాజకీయ బాట వేసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి ప్లాన్డ్ గా.. చనిపోయిన వాళ్లందర్నీ… తన తండ్రి కోసం..” లెక్కల్లో చంపేశారు..”.. ఆ పేర్లు పట్టుకుని రాజకీయ యాత్రలు చేశారు. సొంత పార్టీకి రాచబాటలు వేసుకున్నారు. పార్టీ పెట్టుకున్నారు. కాంగ్రెస్ పార్టీని నామరూపాలు లేకుండా చేశారు. ఆ ఎపిసోడ్ అలా ముగిసిపోయింది.
కానీ ఇప్పుడు.. తనకు కాంగ్రెస్‌లో జరిగిందని చెప్పుకుంటున్న అవమానాన్ని వంగవీటి రాధాకృష్ణకు జగన్ ఎందుకు కల్పించారు…? తనకు మాత్రమే ఆత్మాభిమానమా..? వంగవీటి రాధాకృష్ణకు ఉండదా..? ఇప్పుడు రాధాకృష్ణ.. అప్పట్లో జగన్ ఏ కారణంతో అయితే.. సొంత పార్టీ పెట్టుకున్నారో.. ఇప్పుడు అదే కారణంతో రాజకీయభవిష్యత్ వెదుక్కుంటున్నారు. అయినా వైసీపీ సోషల్ మీడియా… వంగవీటిని ఎందుకు టార్గెట్ చేస్తోంది. జగన్మోహన్ రెడ్డి ఒక్కరే… ఆత్మభిమానం ఉన్న నేతనా..? ఆ పార్టీలో ఇంకెవరికీ అది ఉండకూడదా..?
వంగవీటి రాధాకృష్ణకు .. వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన అవమానాలు.. రాజకీయాల్లో కలకలం రేపడం ఖాయమే. ఆయన వ్యక్తిగత ప్రవర్తనపై… వైసీపీ నేతలు చాలా సార్లు బయటకు చెప్పారు. ఇప్పుడు వంగవీటి చెప్పారు. రాజకీయ భవిష్యత్ కోసం.. కొంత మంది ఇప్పటికిప్పుడు… నోరు తెరవకపోవచ్చు కానీ… ముందు ముందు మరింత మందిబయటకు రావడం ఖాయమే.. !