వైఎస్ జగన్మోహన్ రెడ్డి అలాంటివాడట.. ఇలాంటి వాడట…! అనే ప్రచారం రాజకీయాల్లోకి ఒక్క సారిగా రాలేదు. క్రమంగా వచ్చింది. ఆ పార్టీ నుంచి బయటపడిన నేతలు… ఆన్ ది రికార్డో.. ఆఫ్ ది రికార్డో… చప్పుకోవడంతోనే వచ్చింది. జగన్మోహన్ రెడ్డి తనను తాను మోనార్క్ గా భావించడమే కాదు.. తన పార్టీలోని వారందర్నీ… తన ఇమేజ్ ఉపయోగించుకుని బాగుపడామని ఆశ పడుతున్న వారిగా ట్రీట్ చేస్తూ ఉంటారు. అక్కడే సమస్య వస్తోంది.
జగన్ వ్యక్తిత్వం అంత తేడాగా ఎందుకు ఉంది..?
రాజశేఖర్‌ను జీన్స్, కళ్లద్దాలతో రావొద్దన్నారు..!
దాడి వీరభద్రరావును సార్ అని పిలిస్తేనే పార్టీలో ఉండమన్నారు..!
అసెంబ్లీలో ఉప నేత జ్యోతు నెహ్రూను తన పక్కన కూర్చోవద్దన్నారు..!
వదిలేస్తే గాలికి కొట్టుకుపోతావని వంగవీటికి కించపరిచారు..!
ఇవన్నీ.. వాళ్లకు వాళ్లు చెప్పుకున్న నిజాలు. అవమానాలు భరించి.. భరించి.. బయటకు వచ్చి … మరీ వాళ్లు చెప్పుకున్న వాస్తవాలు. బయటకు వెళ్లిన తర్వాత అలాంటివి చెప్పిన వాటికి విలువేముంటుందని చాలా మంది అనుకుంటారు. కానీ.. పార్టీలో ఉన్నప్పుడు.. ఇలాంటివి చెప్పగలరా..?. అలా చెప్పిన తర్వాత పార్టీలో ఉండగలరా..? నిజానికి పార్టీలో ఉండి.. ఇలాంటివి చెబితే.. కోవర్టులంటారు. అందుకే అందరూ.. తెగించి.. రాజకీయ భవిష్యత్ పై క్లారిటీ లేకపోయినా బయటకు వచ్చి… తమకు జరిగిన అవమానాల గురించి చెబుతున్నారు. వైసీపీలో జగన్ తమకు జరిగిన అవమానాల గురించి చెప్పిన వారిలో చాలా మందికి ఇప్పటికి పొలిటికల్‌గా సరైన ఫ్లాట్ ఫామ్ లేదు. కాబట్టి.. వాళ్లు చెబుతున్నది నిజమనే భావించాలి.
వైసీపీలో తొలు బొమ్మల్లా ఉండాల్సిందేనా..?
భక్తప్రహ్లాద సినిమా చూద్దామని వెళ్తే.. లోపల షకీలా సినిమా కనిపిస్తుందని.. జగన్మోహన్ రెడ్డి తీరును.. ఒకప్పుడు.. వైసీపీలో ఉండి వచ్చిన రఘురామ కృష్ణంరాజు అనే నేత విశ్లేషించారు. చాలా మందిది అదే ఫీలింగ్. వైసీపీలో ఉన్న నేతలకూ.. అదే ఫీలింగ్ . జగన్మోహన్ రెడ్డి.. ఎవర్నీ పరిగణనలోకి తీసుకోరు. ఎవరి సలహాలు తీసుకోరు. ఆయనకు నచ్చిందే ఆయన చేస్తారు. ఆయన చెప్పిందే.. ఎవరైనా పాటించాలి. చివరికి.. వైసీపీ అధికార ప్రతినిధులు కూడా.. సొంతంగా మాట్లాడతారనుకోవడం పొరపాటు. వారు ఎప్పుడు ప్రెస్ మీట్లు పెట్టాలో.. జగన్ కోటరీ నిర్ణయిస్తుంది. ఆ ప్రెస్ మీట్లలో.. కామాలు, పుల్‌స్టాప్‌లతో… సహా ఏం మాట్లాడాలో.. ముందుగానే నోట్ ఇస్తారు. అంతకు మించి ఒక్క మాట కూడా మాట్లాడటానికి లేదు. ఈ విషయం మీడియాలో అందరికీ తలుసు. వ్యక్తిగతంగా జగన్ ఎలా .. ఉంటారో ఆయన పార్టీలోనూ పరిస్థితులు అలానే ఉంటాయి.
పులివెందుల మార్క్ ప్రజాస్వామ్యం నడిపిస్తారా..?
ఇక ఆయన బయట వ్యక్తిగత శైలి ఎలా ఉంటుందో… ఆయన తన పుంలివెదుల జీవితాన్ని ఎలా లీడ్ చేశారో.. ఇప్పటికీ.. పార్టీని అలానే లీడ్ చేస్తూంటారని… మొదటి నుంచి జగన్ లైఫ్‌ను ఫాలో అయిన వాళ్లు చెబుతూ ఉంటారు. ఆయన ఇంట్లో రెండు మూడు ఆఫీసు రూములు ఉటాయి. వచ్చే స్థాయి మనుషుల్ని బట్టి.. ఆఫీసులు మారుతూ ఉంటాయి. అందులో ఓ ఆఫీసు రూమ్‌లో తను కూర్చునే కుర్చీమాత్రమే ఉంటుంది. వచ్చే వారెనరైనా నిలబడే మాట్లాడాలి. సార్ అనాలి. సాధారణంగా.. పార్టీ నుంచి ఎవరైనా వస్తే.. ఆ రూమ్ లో నిలబడి మాట్లాడి వెళ్లిపోవాలి. ఇక కేటీఆర్ లాంటి వాళ్లు వస్తే.. మీటింగ్ జరిపే హాల్ వేరేగా ఉంటుంది. మేడా మల్లిఖార్జునరెడ్డి లాంటి వాళ్లు వస్తే కలిసే హాల్ వేరేగా ఉంటుంది. మొత్తానికి తేడా స్పష్టంగా కనిపిస్తూనే ఉంటుంది.
రాజకీయాల్లో ఇలాంటి క్యారెక్టర్లు రాణిస్తాయా..?
ప్రజలు జగన్మోహన్ రెడ్డిని చూసి ఓట్లేస్తారని.. మిగతా నేతలంతా.. తన ఇమేజ్‌ను ఉపయోగించుకుని ఎమ్మెల్యేలవుతారనేది జగన్ భావన. అనేక సందర్భాల్లో స్వయంగా జగనే దీన్ని చెప్పారు. పాదయాత్ర పూర్తయ్యే సందర్భాల్లో.. ఎమ్మెల్యేలు ఏమీ చేయలేరని నిర్మోహమాటంగా ప్రకటించి… తన స్వభావాన్ని చెప్పకనే చెప్పారు. ఇలాంటి స్వభావాలు రాజకీయాల్లో అతకవు.