బీజేపీ దేశభక్తి అంటే.. దేశంలోని మైనార్టీల మీదకు మెజార్టీని ఎగదోయడం..! ఓ వర్గం అసలు దేశ ప్రజలే కాదని చిచ్చుపెట్టడం…! అదే సమయంలో…దేశం పురోగమనాన్ని… కూడా పట్టించుకోకుండా.. భావోద్వేగాలను రెచ్చగొట్టేయడం..!ఇతర దేశాల నుంచి హిందువుల పేరుతో ఎవరొచ్చినా… పౌరసత్వం ఇచ్చేలా చట్టం చేయడం.. ! ఇప్పుడు భారతరత్నాలను కూడా రాజకీయ పంపకాలుగా మార్చడం..!. భారతరత్న పురస్కారాల ప్రకటన వెనుక రాజకీయ ప్రయోజనాలను పక్కాగా చూసుకున్నారు నరేంద్రమోడీ. రాజకీయంగా చిక్కులు ఎదుర్కొంటున్న చోట భావోద్వేగాలను..రెచ్చగొట్టి … సంతృప్తిగా రాజకీయ లాభం పొందేలా బ్యాలెన్స్ చూసుకున్నారు. ముగ్గురికి భారతరత్న ప్రకటన వెనుక వారి గొప్పదనం కన్నా.. రాజకీయ పరిస్థితులే కలసి వచ్చాయి.
ప్రణబ్ పై అంత ప్రేమ ఎందుకు పొంగుకొచ్చింది..?
ముగ్గురికి దేశ అత్యున్నత పురస్కారాలు ప్రకటించడానికి స్పష్టమైన రాజకీయ కారణాలు ఉన్నాయి. కాంగ్రెస్ కురువృద్ధుడు, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఆరెస్సెస్ దివంగత ప్రముఖుడు నానాజి దేశ్ ముఖ్, ప్రముఖ కళాకారుడు భూపేన్ హజారికాలకు ఈ పురస్కారాలు ప్రకటించారు. ప్రణబ్ మినహా.. ఇద్దరికీ.. మరణానంతరం పురస్కారం ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరెస్సెస్ దిగ్గజాలకు.. భారతరత్న ఇచ్చిన.. కేంద్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు.. జీవితాంతం కాంగ్రెస్ వాదానికి కట్టుబడిన ప్రణబ్ ముఖర్జీకి.. భారతరత్న ప్రకటించింది. నిస్సందేహంగా ప్రణబ్ ముఖర్జీ దిగ్గజం అనదగ్గ నేత. కానీ.. ఇంత వరకూ ఏ ఒక్కరు కూడా.. ఆయనకు.. భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేయలేదు. ఎందుకంటే.. ఆయన ఇటీవలి కాలం వరకూ రాష్ట్రపతిగా ఉన్నారు. ఆయనకు భారతరత్న ఇవ్వడం వెనుక ఉన్న ప్రధానమైన కోణం బెంగాల్ రాజకీయమే. బెంగాల్ లో రాజకీయంగా బలపడటానికి భారతీయ జనతా పార్టీ తాము చేయాల్సిందంతా చేస్తోంది. కానీ.. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ మాత్రం.. అడుగు పెట్టనీయడం లేదు. దీంతో నరేంద్రమోడీ… బెంగాల్ ప్రజలను… మరో విధంగా ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. అందుకే ప్రణబ్ ముఖర్జీకి దేశ అత్యున్నత పురస్కారం ప్రకటించారు. ఇప్పుడు.. బెంగాలీకి .. అత్యంత గౌరవం ఇచ్చానని చెబుతూ.. నరేంద్రమోడీ, అమిత్ షా.. బెంగాల్ ప్రజల్లోకి సెంటిమెంట్ రగిలించడానికి సిద్ధమవుతారు. ప్రబణ్ నే బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టుకుని బెంగాల్ లో ఎన్నికలకు వెళ్తారు
హిందూ బేస్‌ను కాపాడుకోవడానికి నానాజి దేశ్‌ముఖ్‌కు రత్నమయ్యారా.!
నానాజి దేశ్ ముఖ్ మహారాష్ట్రకు చెందిన వారు. ఆరెస్సెస్ లో దిగ్గజంగా ఎదిగారు. ఆరెస్సెస్ నేపధ్యం ఉన్న వారికి ఆయన గ్రామీణ వికాసం కోసం పాటు పడ్డారని చెబుతారు. ఆయనకు ఇప్పుడు.. భారతరత్న ఇవ్వడానికి… మహారాష్ట్రలోని రాజకీయ పరిస్థితులే కారణం. మహారాష్ట్రలో మిత్రపక్షం శివసేన.. నిఖార్సైన హిందూవాదంతో.. ఒంటరి పోరుకు వెళ్తోంది. బీజేపీ .. శివసేనతో పోలిస్తే.. హిందూత్వవాదంలో వెనుకబడింది. ఇలాంటి సమయంలో.. మహారాష్ట్ర కు చెందిన ఆరెస్సెస్ ప్రముఖుడికి భారతరత్న ఇచ్చి.. బేస్ ను కాపాడుకోవాలనుకుంటోంది. తప్ప… ఆయనపై గౌరవంతోనే.. ఆయన చేసిన సేవలకో ఇవ్వలేదు.
“పౌరసత్వ బిల్లు” జ్వాలలు పెరగకుండా హజారికా గుర్తొచ్చారా..?
ఇక భూపేన్ హజారికా.. అసోంకు చెందిన వారు. ఆయన ప్రపంచం మెచ్చిన కళాకారుడు. ఆయనకు ఎప్పుడో భారతరత్న దక్కాల్సింది. కానీ రాజకీయంగా అవకాశం చూసుకుని.. బీజేపీ.. మరణానంతరం.. ఈ పురస్కారాన్ని ప్రకటించింది. ప్రస్తుతం.. ఈశాన్య రాష్ట్రాల్లో పౌరసత్వ బిల్లుపై… అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఓ రకంగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నారు. అసోంలో మిత్రపక్షం.. అస్సాం గణపరిషత్ కూటమికి గుడ్ బై చెప్పింది. ఇప్పుడీ పరిస్థితుల్ని సానుకూలతగా మల్చుకుని..ఈశాన్య రాష్ట్రాల కళాకారుడికి.. దేశ అత్యున్నత గౌరవం ఇచ్చానని చెప్పుకుని మళ్లీ ఆదరణ పొందడానికి బీజేపీ ఈ ప్రణాళిక వేసింది. దేశ అత్యున్నత పురస్కారాలను కూడా.. రాజకీయం చేసిన బీజేపీ.. దేశభక్తి గురించి మాట్లాడుతోంది.