మిస్ గ్రానీ అంటూ వచ్చిన విదేశీ సినిమా మన టాలీవుడ్ జనాలను గట్టిగానే ఆకట్టుకున్నట్లు కనిపిస్తోంది. ఈ సినిమానే దర్శకురాలు నందినీ రెడ్డి ‘బేబీ’ అనే పేరుతో సమంత హీరోయిన్ గా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నాగశౌర్య కూడా ఓ పాత్ర చేస్తున్నాడు. పైకి యంగ్ గా కనిపిస్తూ, లోపల ఓల్డ్ గా వుండే టైపు క్యారెక్టర్ సమంత చేస్తోంది.
ఇదిలా వుంటే ఇదే పాత్రను అట్నుంచి ఇటు మార్చి రవితేజ తో డిస్కోరాజా కథ తయారుచేసినట్లు ఇండస్ట్రీ టాక్. ఓల్డ్ మ్యాన్ కారణాంతరాల వల్ల కొన్నాళ్లు కనుమరుగై, యంగ్ లుక్ తో రావడం, వచ్చి పగ తీర్చుకోవడం లాంటి వ్యవహారం అన్నమాట. వాస్తవానికి గతంలో చాలా సినిమాల్లో తండ్రి పగ తెలుసుకుని కొడుకు రివెంజ్ తీర్చుకోవడం, డబుల్ రోల్ చూసాం. ఇప్పుడు ఓల్డ్ మ్యాన్ తన పగను తానే యంగ్ లుక్ లో తీర్చుకునే లాంటి వ్యవహారం అనుకోవాలేమో?
దర్శకుడు విఐ ఆనంద్ హాలీవుడ్ సినిమాల స్ఫూర్తితో డిఫరెంట్ కథలు తయారుచేసుకుంటారు. ఆ విధంగా ఇప్పుడు డిస్కోరాజా కు కూడా ఈ డిఫెరంట్ కథ తయారుచేసారేమో?