అనుకున్నది అనుకున్నట్లు జరగకపోతే ఎవరికైనా కాస్త అసంతృప్తి, అసహనం తప్పవు. అలాంటిది, చిటికెలో సహనం కోల్పోయే మనస్తత్వం వున్నవారి సంగతి చెప్పేదేముంది? హీరో బాలకృష్ణ వ్యవహారం తెలిసిందే. ఆయన దగ్గర అంతా అత్త పదును-కత్తిపదును అన్నట్లుంటుంది వ్యవహారం.
అలాంటి బాలకృష్ణకు తాను ఎంతో ఊహించుకున్న ఎన్టీఆర్ బయోపిక్ కు ఎదురుదెబ్బ తగిలితే ఎలా వుంటుంది. అందుకే ఈ మధ్య కాస్త అసహనంగా వుంటున్నట్లు తెలుస్తోంది. బయోపిక్ పార్ట్ 2 సెట్ లో బాలకృష్ణను చూసిన వారు ఆయనలో కాస్త అసహనం తొంగిచూస్తోందని, చికాకుగా కనిపిస్తున్నారని చెబుతున్నారు. ఎన్టీఆర్ బయోపిక్ పార్ట్ వన్ విడుదలకు ముందు ఆయనను ఎవరు కలిసినా కనీసం ఒక్క మాటయినా బయోపిక్ గురించి మాట్లాడేవారని, అదే బయోపిక్ తో ఏమాత్రం కనెక్షన్ వున్నవారు కలిసినా, మరి నాలుగు మాటలు ఎక్కువే మాట్లాడేవారని టాక్.
అయితే ఇప్పుడు ఆయన ఎవరి దగ్గరా బయోపిక్ గురించి కానీ, పార్ట్ 2 విడుదల గురించి కానీ అస్సలు పెదవి విప్పడం లేదని తెలుస్తోంది. అంతే కాదు, డైలీ రోటీన్ లో చిన్న చిన్న తేడాలు జరిగినా కాస్త ఎక్కువ రియాక్ట్ అవుతూ చికాకు పడుతున్నారని ఇండస్ట్రీ జనాలు చెవులు కొరుక్కుంటున్నారు.