వైయస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర ఆధారంగా దర్శకుడు మహి వి రాఘవ్ తెరకెక్కించిన సినిమా ‘యాత్ర’. ఇందులో కేవలం రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర గురించి మాత్రమే చూపించానని, కథంతా రాజశేఖర్రెడ్డి చుట్టూ తిరుగుతుందని ఆయన అన్నారు. వైయస్సార్ గొప్పదనం చెప్పడానికి మరొకరిని చెడుగా చూపించాల్సిన అవసరం లేదనేది తన అభిప్రాయమన్నారు.
‘యాత్ర’ చంద్రబాబు పాత్ర లేదని స్పష్టం చేశారు మహి వి. రాఘవ్. ప్రముఖ యాంకర్ అనసూయది ఫిక్షనల్ క్యారెక్టర్ అని ఆయన చెప్పారు. సబితా ఇంద్రా రెడ్డి తో సహా ఇద్దరు ముగ్గురు పాత్రలను స్ఫూర్తిగా తీసుకుని అనసూయ పాత్ర రూపొందించానని దర్శకుడు అన్నారు. కథ ప్రకారం సినిమాటిక్ లిబర్టీస్ కొన్ని తీసుకున్నానని తెలిపారు.
ఇంత మహి వి రాఘవ్ మాట్లాడుతూ “రాజశేఖర్ రెడ్డి గారి గురించి ప్రజలకు తెలుసు. ఆయన చేసిన పాదయాత్ర కూడా తెలుసు. అయితే.. పాదయాత్ర వల్ల ఆయనలో ఎటువంటి మార్పు వచ్చిందనేది చిత్ర కథ. దీన్ని సినిమాగా తీయడానికి నేను కొన్ని లిబర్టీస్ తీసుకున్నాను. సుమారు 18 నెలలుగా ఈ కథపై సినిమాపై పనిచేస్తుండటంతో నాకు జడ్జిమెంట్ అనేది పోయింది. విడుదల రోజు ప్రేక్షకులు సినిమా చూసి ఇచ్చే తీర్పు కోసం ఎదురు చూస్తున్నా” అన్నారు.