భారతీయ జనతా పార్టీ దక్షిణాదిపై దృష్టి పెట్టింది. ఈ సారి హిందీ రాష్ట్రాల్లో కోల్పోయే స్థానాలను దక్షిణాదిలో గెలుచుకోవలాని ప్రయత్నాలు చేస్తోంది. కానీ భారతీయ జనతా పార్టీకి ఉత్తరాది పార్టీగా పేరు ఉంది. హిందీ భాష మాట్లాడేవారికి మాత్రమే ఆ పార్టీ అన్నట్లుగా ఉత్తరాది ప్రాంతాలలోనే బీజేపీ ప్రాబల్యం చూపిస్తోంది. దక్షిణాది రాష్ట్రాల్లో ఆ పార్టీ విస్తరించలేదు. ఆ పార్టీకి.. కొంత మంది దక్షిణాది నేతలు నేతృత్వం వహించినప్పటికీ.. వారికిని కూడా దక్షిణాదిలో తమ పార్టీ నుంచి ప్రాతినిధ్యం ఉందని చెప్పుకోవడానికే తప్ప… మరింకో కారణంతో… ప్రాధాన్యం ఇవ్వలేదు.
బీజేపీ హిందీ పార్టీగా ఎందుకు మారింది..?
భారతీయ జనతా పార్టీ.. తమ పార్టీ ఉత్తరాది పార్టీ కాదు.. దక్షిణాది పార్టీ కూడా అని చెప్పడానికి ఇప్పుడు బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. ఇది ఆ పార్టీ భవిష్యత్‌కు కూడా చాలా కీలకం. పాంచజన్య అనే పత్రికకు ఎడిటర్‌గా ఉన్న.. బీజేపీ సిద్ధాంతకర్త గతంలో.. దక్షిణాది ప్రజలపై తీవ్రమైన జాతి వివక్ష వ్యాఖ్యలు చేశారు. దక్షిణాది వారు నల్లజాతి అన్నట్లుగా మాట్లాడారు. దక్షిణాది వాళ్లు నల్లగా ఉంటారు. అయినా మాకు ఎలాంటి వివక్షా లేదు. మేము శ్రీకృష్ణుడ్ని పూజించలేదా..? . అంటూ.. దక్షిణాది ప్రజలు నల్లగా ఉంటారు.. అయినప్పటికీ.. కలసి ఉంటామంటున్నట్లుగా చెప్పుకొచ్చారు. అదేదో… ఉత్తరాది ప్రజలు దేశం నుంచి విడిపోతామన్నట్లుగా.. దక్షిణాది ప్రజలు కలసి ఉందామని బతిమాలుతున్నట్లుగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. దేశం నుంచి విడిపోయే ఉద్దేశం దక్షిణాదికి లేదు. నిజంగా విడిపోయే పరిస్థితి వస్తే.. దక్షిణ భారదేశంలో… చాలా అడ్వాన్స్డ్ కంట్రీ అవుతుంది. యూరోపియన్ కంట్రీస్‌తో పోటీ పడేలా ఉంటుంది. ఉత్తర భారతదేశంలో పరిస్థితి వేరుగా ఉంటుంది. అక్కడ కులం మతం పేరుతో ఘర్షణలకు దిగుతూ ఉంటారు. మూఢత్వంతో ఉంటారు. పేదరికం ఎక్కువగా ఉంటుంది. దక్షిణాదికి ఆ సమస్య లేదు. అయినా… మీతో కలిసుంటున్నామని.. బీజేపీ సిద్ధాంతకర్త చెప్పుకొచ్చారు. నిజానికి.. దక్షిణాదినే.. ఉత్తరాదితో కలిసి ఉంటోంది. ఇలాంటి కారణాల వల్ల బీజేపీ నార్త్ ఇండియా పార్టీ మాత్రమే.. దక్షిణాది పార్టీ కాదు అని ప్రజల్లో అభిప్రాయం బలపడిపోయిది.
2019లో దక్షిణాది అధికారం ఇస్తుందని మోడీ ఆశిస్తున్నారా..?
2014 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ… ఘన విజయం సాధించింది. అయితే ఈ ఘన విజయం మొత్తం హిందీ రాష్ట్రాల్లోనే వచ్చింది. దక్షిణాదిలో కేవలం కర్ణాటకలో మాత్రమే కాస్త ఫలితం చూపించగలిగింది. మోడీ హవా కారణంగా.. గత ఎన్నికల్లో హిందీ రాష్ట్రాల్లో ఉన్న… లోక్ సభ సీట్లలో… 95 శాతం గెలుచుకున్నారు. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్, ఢిల్లీ, గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో దాదాపుగా మొత్తం సీట్లు గెలుచుకుంది. వచ్చే ఎన్నికల్లో ఇది సాధ్యంకాదు. దాదాపుగా వంద సీట్లకు పైగా తగ్గిపోతాయని.. సర్వేలు చెబుతున్నాయి. ఈ విషయాన్ని బీజేపీ అగ్రనేతలు కూడా అంగీకరిస్తున్నారు. అందుకే.. ఈ తగ్గిపోయే సీట్లను.. ఎక్కడ పెంచుకోవాలంటే… వారికి దక్షిణాదే.. పెద్ద అవకాశంగా కనిపించింది. అందుకే.. బీజేపీ టార్గెట్ “సెవన్ స్టేట్స్” అనే పిలుపు ఇచ్చింది. కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, పశ్చిమబెంగాల్, ఒడిషా, తెలంగాణ ఈ ఏడు రాష్ట్రాలు. ఈ రాష్ట్రాల్లో పికప్ అవ్వాలని నిర్ణయించింది. ఇందులో.. కీలకంగా ఐదు రాష్ట్రాల్లో ఎదగాలని ఎదిగితేనే.. అధికారం ఉంటుందని.. బీజేపీకి భావిస్తోంది.
శబరిమల లాంటి దండయాత్రలు ఎన్ని చేస్తే దక్షిణాదిలో బీజేపీకి సీట్లొస్తాయి..?
కేరళలో.. శబరిమల ఇష్యూ ఇందుకే హైలెట్ అవుతోంది. శబరిమల ఇష్యూ తర్వాత హిందూ ఓట్లను పోలరైజ్ చేసుకుని అక్కడ గెలవాలని బీజేపీ ప్రయత్నం. అక్కడ కనీసం పదిహేను సీట్లు తెచ్చుకోవాలని ప్రయత్నిస్తోంది. అక్కడ బీజేపీకి ఓట్లు పెరుగుతాయి కానీ… సీట్లు రావు. శబరిమల ఇష్యూ ద్వారా.. ఓట్లు పెంచుకుంది. ఈ ఓట్లు.. కాంగ్రెస్‌కు నష్టం. కాంగ్రెస్ కూడా అక్కడ హిందూ బేస్ రాజకీయం చేస్తోంది. అక్కడి ప్రభుత్వం కమ్యూనిస్టులది కాబట్టి.. వారి సిద్ధాంతాలు మొదటి నుంచి వేరుగా ఉంటాయి. ఇక తమిళనాడులో… కొద్ది రోజులుగా.. బీజేపీ రాజకీయ సినిమా చూపిస్తోంది. అన్నాడీఎంకే రాజకీయాల్ని బీజేపీ శాసిస్తోంది. ఇప్పుడు రజనీకాంత్ కూడా కలుస్తారని చెబుతోంది. కానీ… తమిళనాడు నిజానికి మొదటి నుంచి హిందీ వ్యతిరేక భావన ఉన్న ప్రాంతం. తమిళనాడులో ఉన్న ఆర్థిక, సామాజిక పరిస్థితులు… బీజేపీని అడుగు పెట్టనీయవు. ఆంధ్రప్రదేశ్ బీజేపీ పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. ఎవరికీ డిపాజిట్లు కూడా రావు. తెలంగాణలో… కూడా అసెంబ్లీ ఎన్నికల్లో డిపాజిట్లు కూడా కోల్పోయారు. అందుకే ఒక్క సీటు కూడా.
దక్షిణాదిలోని ఐదు రాష్ట్రాల్లో ఐదు సీట్లు వస్తాయా..?
బీజేపీకి ఆశలు ఉన్న ఒకే ఒక్క రాష్ట్రం.. కర్ణాటక. అక్కడ… కాంగ్రెస్, జేడీఎస్ కలసి పోటీ చేస్తే.. బీజేపీ సిట్టింగ్ సీట్లు 17లో ఎన్ని ఉంటాయో చెప్పడం కష్టం. ఉపఎన్నికల్లో.. కాంగ్రెస్ – జేడీఎస్ భారీ విజయాలు నమోదు చేశాయి. ఆ లెక్కలు చూస్తే… బీజేపీకి సిట్టింగ్ సీట్లు దక్కడం కష్టం అని తేలిపోతోంది. అంటే.. దక్షిణాదిలోని ఐదు రాష్ట్రాల్లో బీజేపీ దాదాపుగా జీరో. కర్ణాటకలో కూడా.,. పెంచుకునే పరిస్థితి లేదు.. ఇంకా కోల్పోతారని చెబుతున్నారు. అందుకే బీజేపీ పెట్టుకున్న మిషన్ వర్కవుట్ అయ్యే అవకాశాలు లేవు.