మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్.. తెలంగాణలో.. మహాకూటమికి అనుకూలంగా సర్వేలు ప్రకటించిన వ్యవహారం కలకలం రేపింది. ఆయన తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ప్రచారం జరిగింది. తన సర్వేలు సక్సెస్ కాకపోవడంతో.. ఆయన వాటి గురించి మాట్లాడటం మానేశారు. కానీ టీడీపీ అధినేతతో మాత్రం… సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. టీడీపీ కోసం ఆయన సర్వేలు చేస్తున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబుకు సన్నిహితంగా ఉండే పత్రికాధినేత వేమూరి రాధాకృష్ణతో కలిసి.. ఆయన .. రెండు రోజుల కిందట.. చంద్రబాబుతో సమావేశమయ్యారు. దాదాపు రెండు గంటల పాటు వీరు చర్చలు జరిపారు. ఏ అంశంపై అన్న విషయంలో క్లారిటీ లేదు కానీ… భేటీ మాత్రం నిజమేనని.. కొన్ని మీడియా వర్గాలు చెబుతున్నాయి.
చంద్రబాబు రాజకీయ నిర్ణయాలను.. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ప్రభావితం చేస్తూంటారని.. కొంత మంది చెబుతూ ఉంటారు. అదే సమయంలో… టీడీపీలో చేరికల విషయంలోనూ ఆయన కొంత మధ్యవర్తిత్వం వహిస్తూటారని… రాజకీయవర్గాలు చెబుతూ ఉంటాయి. కోట్ల విజయభాస్కరరెడ్డి కుటుంబం.. చంద్రబాబుతోభేటీ కోసం ఆయన నివాసంలో ఉన్నప్పుడే.. వీరు కూడా వెళ్లారు. అంటే… కోట్ల కుటుంబం.. చేరికతో.. కర్నూలు జిల్లాలో పరిస్థితి ఎలా ఉంటుందో.. ఓ సర్వే నివేదికను.. తీసుకెళ్లారని అనుకోవచ్చు. అదే సమయంలో లగడపాటి రాజగోపాల్.. తెలుగుదేశం పార్టీలో చేరి.. ఏదో ఓ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయాలన్న ఆసక్తితో ఉన్నారన్న ప్రచారం కూడా ఇటీవలి కాలంలో ఉద్ధృతంగానే సాగుతోంది. ఈ భేటీతో ఆ ప్రచారం మరింత ఊపందుకునే అవకాశం ఉంది.
అయితే జగన్కు చెందిన మీడియా మాత్రం ఈ భేటీపై సర్వేల కోణంలోనే కథనం ప్రచురించింది. తెలంగాణలో ప్రజలను గందరగోళ పరిచినట్లుగా..ఏపీలోనూ.. టీడీపీకి ఆధిక్యం చూపిస్తూ.. సర్వేలను లగడపాటి విడుదల చేస్తారని… అందుకే.. చంద్రబాబుతో మంతనాలు జరుపుతున్నారని రాసుకొచ్చారు. అయితే.. తెలంగాణ అనుభవంతో.. లగడపాటి… ఎంత వరకూ.. మళ్లీ సర్వేలు విడుదల చేస్తారనేది.. కాస్త ఆలోచించాల్సిన విషయమే. లగడపాటి ఒక్కరే వెళ్లి సీఎంతో భేటీ అయితే.. పెద్ద విశేషం కాదు కానీ… పక్కన ఆంధ్రజ్యోతి పత్రిక యజమాని ఉండటంతో.. మ్యాటర్ ఆసక్తికరంగా మారింది.