ఏప్రిల్ మొదటి వారంలో… అది ఒకే రోజున… నాని, నాగ చైతన్య… తమ తమ సినిమాలను విడుదల చేయాలనుకుంటున్నారట. ఇద్దరూ క్రికెటర్లుగా నటించిన సినిమాలు బాక్సాఫీస్ బరిలో పోటీ పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
నాగ చైతన్య క్రికెటర్ గా నటిస్తున్న సినిమా ‘మజిలీ’. ఇందులో లవ్, బ్రేక్ అప్ వగైరా వగైరా వ్యవహారాలు ఉన్నాయి. నాని లేటు వయసులో క్రికెట్ బ్యాట్ పట్టి విజయాలు సాధించిన ఆటగాడిగా నటిస్తున్న సినిమా ‘జెర్సీ’. ఇందులో లవ్ కంటే ఎమోషనల్ డ్రామా ఎక్కువ. ఆల్రెడీ విడుదలైన సినిమా టీజర్ ప్రేక్షకులకు బాగా నచ్చింది.
నాగ చైతన్య సినిమా ‘మజిలీ’ ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మేరకు నిర్మాతలు ఓ ప్రకటన చేశారు. అయితే.. ముందు నుంచి అదే తేదీకి ‘జెర్సీ’ చిత్రాన్ని విడుదల చేయాలని నాని చిత్ర బృందం అనుకుందట. ఈ మేరకు డిస్ట్రిబ్యూటర్లకు సమాచారం ఇచ్చారట. ఈ లోపు ‘మజిలీ’ విడుదల తేదీ ప్రకటించారు. రెండు సినిమాలు క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కినవే. అందుకని నాని సినిమాను అదే తేదీన విడుదల చేయాలని నిర్ణయించుకున్నాని సమాచారం. రెండు సినిమాలు ఒకే రోజు వస్తే.. బాక్సాఫీస్ గ్రౌండ్లో ఏ క్రికెటర్ ఎంత స్కోరు చేస్తాడో?? అదే అదే ఎంత కలెక్షన్స్ రాబడతాడో? చూడాలి!