లాస్ట్ ఇయర్ మొదటి సూపర్ హిట్ సినిమా నందమూరి కళ్యాణ్ రామ్ పటాస్. అనీల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ సినిమా కళ్యాన్ రామ్ కు మంచి హిట్ ఇచ్చింది. ఆ సినిమా హిట్ తోనే రెండోది దిల్ రాజు నిర్మాణంలో అవకాశం కొట్టేశాడు అనీల్. అయితే ఇప్పుడు మొదటి సినిమా సెంటిమెంట్ ను ప్రస్తుతం చేస్తున్న సినిమాలో కూడా కంటిన్యూ చేస్తున్నాడట. అనీల్ రవిపూడి దర్శకత్వంలో మెగా హీరో సాయి ధరం తేజ్ హీరోగా నటిస్తున్న సినిమా సుప్రీం.
రాశి ఖన్నా కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో తన మొదటి సినిమా పటాస్ హీరోయిన్ శృతి సోది కూడా తీసుకున్నాడట. పటాస్ సెంటిమెంట్ కొనసాగిస్తూ ఇప్పుడు సుప్రీం సినిమాలో ఓ ప్రత్యేక పాత్ర కోసం ఆమెను తీసుకున్నారట. సుప్రీంలో క్యాప్ డ్రైవర్ గా నటిస్తున్న సాయి ధరం తేజ్ కు హీరోయిన్ అవ్వడం కోసం ప్రయత్నాలు చేసే అమ్మాయిగా శృతి సోది నటిస్తుంది.
సినిమాలో ఆ పాత్రతోనే ట్విస్ట్ లు ఉంటాయట. అంతేకాదు సాయిధరం తేజ్ తో ఓ సాంగ్ లో కూడా ఆడి పాడనుందట ఈ అమ్మడు. పటాస్ హిట్ తో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నా సరైన అవకాశాలు రాని శృతి సోది మరోసారి పటాస్ కాంబినేషన్ తో వస్తున్న ఈ సుప్రీం సినిమాతోనైనా కలిసొస్తుందని ఆశిస్తుంది.