ఒక విధంగా హీరో రాజ్ తరుణ్ రీ ఎంట్రీ స్టార్ట్ కాబోతోంది. వరుస ఫ్లాపులతో ఒక్కసారిగా కెరీర్ ఫుల్ స్టాప్ పడిపోయింది. ఇలాంటి టైమ్ లో నిర్మాత దిల్ రాజు ముందుకు వచ్చి మళ్లీ రాజ్ తరుణ్ ను ట్రాక్ మీదకు పెట్టే బాధ్యతను తీసుకున్నారు. చిన్న డైరక్టర్ కృష్ణారెడ్డి తయారుచేసిన కథతో రాజ్ తరుణ్ హీరోగా సినిమా స్టార్ట్ చేయబోతున్నారు. ఈ వైనం అంతా తెలిసిందే.
ఇలా చేయబోయే సినిమాకు టైటిల్ కూడా ఫిక్స్ చేసారు. నీదీ నాదీ ఒకటే లోకం. ఇదీ టైటిల్. పక్కా యూత్ ఫుల్ లవ్ స్టోరీ అంట ఈ సినిమా. హీరోయిన్ ఎంపికకు కసరత్తు సాగుతోంది. అది పూర్తయిపోతే, సినిమా సెట్ మీదకు వెళ్లడానికి రెడీగా వుంది.
2019లో ఎఫ్ 2, మహర్షి, 96 సినిమాల తరువాత విడుదలయ్యే సినిమా రాజ్ తరుణ్ దే. ఆ తరువాతే ఇంద్రగంటి-నాని సినిమా వుంటుంది. ఇదిలా వుంటే రాజ్ తరుణ్ ఈ సినిమా తరువాత ఓ సోషియో ఫాంటసీ సినిమాను కొత్త దర్శకుడు మల్లిడి వేణు డైరక్షన్ లో చేసే అవకాశం వుంది.