బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఆఫీసులో చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఫోటోలు ఉంటాయట. ఈ విషయాన్ని ఆయనే చెప్పారు. ఎందుకు ఉంటాయట.. గత ఎన్నికల్లో చంద్రబాబు విశాఖ ఉత్తర నియోజకవర్గాన్ని బీజేపీకి వదిలి వేశారు. టీడీపీ తరపున సంపూర్ణ సహకారం అందించారు. పవన్ కల్యాణ్ ప్రచారంతో.. ఆయన అభిమానుల ఓట్లతో .. గెలిచారట. అందుకే.. ఆయన అఫీసులో.. కృతజ్ఞతా పూర్వకంగా.. చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఫోటోలు ఉంచుకున్నారు. ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే… ఎన్నికలు వచ్చేశాయి కదా..మరి..! భారతీయ జనతా పార్టీ తరపున పోటీ చేసేంత ఔదార్యం.. ధైర్యం ఆయనకు లేవు. చూస్తూ . చూస్తూ.. ఎమ్మెల్యే హోదాను పోగొట్టుకునే మనసు కూడా లేదు.
అందుకే… ఇలా రాజకీయంగా అడ్వాంటేజ్ లు చూసుకుంటున్నారు. క్షత్రియ వర్గ ఎమ్మెల్యేలతో కలిసి.. టీడీపీ అధినేత వద్దకు వెళ్లి చివరి ప్రయత్నాలు చేశారు. వెళ్లింది.. క్షత్రియ కార్పొరేషన్ కోసమే అయినా… ఆయన ఉద్దేశం మాత్రం.. టీడీపీలో చేరిక. టిక్కెట్ ఇస్తారేమోనన్న అంచనాల కోసమే… చంద్రబాబు ఈ విషయంలో ఎలాంటి స్పందన అయినా ఇచ్చారో లేదో కానీ.. బయటకు వచ్చి… బీజేపీకి కాస్త యాంటీగానే మాట్లాడారు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో బీజేపీతో ఎవరు పొత్తులు పెట్టుకుంటారని.. చెప్పుకొచ్చిన ఆయన… ఎన్నికల్లో ఏ పార్టీ తరపున పోటీ చేస్తాననేది తర్వాత చెబుతానన్నారు. అంటే బీజేపీ తరపున పోటీ చేసే ప్రశ్నే లేదని చెప్పినట్లు అన్నమాట.
గతంలో విష్ణుకుమార్ రాజు..జగన్ ను బీభత్సంగా పొగిడేశారు. ఆ సమయంలో… తన మామగారికి వైఎస్ అంటే ఎంతో ఆభిమానం అని.. ఆయన ఫోటో తమ ఇంట్లో ఉండేదని చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఆ ఫోటోల సెంటిమెంట్ ను.. టీడీపీ, జనసేనల మీదకు ప్రయోగించారు. ఇంతకీ.. తన ఇంట్లో మోడీ.. ఫోటో ఇంకా ఉందో.. లేకపోతే.. తీసేశారో మాత్రం చెప్పలేదు.