ఆలు లేదు చూలు లేదు..అన్నట్లుగా వుంది హరీష్ శంకర్ వాల్మీకి వ్యవహారం. హీరోయిన్ లేదు, షెడ్యూలు లేదు. అప్పుడే మనోభావాలు దెబ్బతినేసాయి అంటూ ఆందోళన మొదలయిపోయింది. వాల్మీకి అని టైటిల్ పెట్టి దానికి గన్ తగిలించేసారికి, అప్పుడే వాల్మీకి సామాజిక వర్గం తరపున సీమ ఏరియాలో ఆందోళన మొదలయిపొయింది.
గన్ తగిలించి, తమ సామాజిక వర్గాన్ని కించపరిచారని, మనోభావాలు దెబ్బతీసారని గొడవ ప్రారంభమైంది. పాపం హరీష్ శంకర్ కు ఇది మొదటి సారి కాదు. రెండోసారి. దువ్వాడ జగన్నాధమ్ టైమ్ లో కూడా అగ్రహారం..తమలపాకు పదాలు వాడి బ్రాహ్మణుల మనోభావాలు దెబ్బతీసాడు. అప్పుడు ఆ సినిమా పెద్ద హిట్.
అప్పట్లో చాలా గడబిడ అయింది. అయితే అదంతా సినిమా విడుదలకు ముందు. ఇప్పుడు అసలు ప్రారంభం కాకుండానే రగడ మొదలైంది.హరీష్ కు ఇది శుభ సూచకమో? లేక మరేంటో కాలమే నిర్ణయించాలి.