‘ఎన్టీఆర్’ బయోపిక్‌లో హరికృష్ణ పాత్ర ఉదాత్తంగా సాగిపోతోంది. తండ్రి ఎన్టీఆర్‌కి చేదోడు వాదోడుగా నిలిచిన హరికృష్ణనే ఈ బయోపిక్‌లో చూపిస్తున్నారు. అయితే… ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’లో మాత్రం హరికృష్ణలోని విలనిజాన్ని వర్మ చూపించబోతున్నాడని టాక్. వర్మ రూపొందిస్తున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ అనేక వివాదాలకు కేంద్ర బిందువయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ సినిమాని ఎలాగైనా అడ్డుకోవాలని ఓ వర్గం గట్టిగా ప్రయత్నిస్తున్నా – చాప కింద నీరులా తన పని తాను చేసుకుపోతున్నాడు వర్మ.
‘ఇది ఎన్టీఆర్ అసలైన బయోపిక్’ అని వర్మ చెబుతున్నా – ఎక్కువ శాతం లక్ష్మీ పార్వతి పాత్ర చుట్టూనే తిరగబోతోంది. ఎన్టీఆర్ – లక్ష్మీపార్వతిల వివాహం తరవాత.. ఎన్టీఆర్‌ని కుటుంబ సభ్యులు దూరంగా ఉంచారు. పార్టీ వ్యవహారాలలో, కుటుంబ విషయాలలో లక్ష్మీపార్వతి జోక్యం చేసుకోవడం ఎన్టీఆర్ తనయులకు అస్సలు నచ్చలేదు. మరీ ముఖ్యంగా హరికృష్ణకు. చాలాసార్లు లక్ష్మీపార్వతికి హరికృష్ణ వార్నింగ్ ఇచ్చారట. అలాంటి సన్నివేశాలన్నీ.. లక్ష్మీస్ ఎన్టీఆర్‌లో చూపిస్తున్నారని సమాచారం. కల్యాణ్‌రామ్, జానకీరామ్, రామకృష్ణ, తారకరత్న పాత్రలు కూడా ఈ బయోపిక్‌లో ఉంటాయని తెలుస్తోంది. మరి బాలకృష్ణ ని చూపిస్తారో, లేదో??