అప్పుడెప్పుడో 2017లో వచ్చింది ‘స్పైడర్’. అప్పటి వరకూ టాప్ గేర్‌లో సాగిన రకుల్ ప్రీత్ సింగ్ కెరీర్‌కి ఈ భారీ ఫ్లాప్ ఒక్కసారిగా బ్రేకులు వేసింది. ఆ తరవాత తెలుగు తెరపై రకుల్ ఫ్రీత్ సింగ్ కనిపించిందే లేదు. ‘కథానాయకుడు’లో మాత్రం శ్రీదేవిగా మెరిసింది. ఆ డిజాసర్ట్లో భాగం పంచుకుంది. కాకపోతే… ఈ సినిమాలో రకుల్ కూడా ఉంది అని గుర్తు పెట్టుకునేంత ఛాన్స్ లేదు. తెలుగులో కథానాయికగా రకుల్ చేస్తున్న సినిమాలేవీ లేవు. తమిళ, హిందీలో మాత్రం కొన్ని సినిమాలు దక్కించుకుంది. అందులో కార్తీ తో చేస్తున్న ‘దేవ్’ ఒకటి. ఇది వరకు వీరిద్దరూ కలసి ‘ఖాకీ’లో నటించారు. ఆ సినిమాలో వీరిద్దరి జోడీ బాగానే కనిపించింది. సినిమా కూడా బాగానే ఆడింది. ఇప్పుడు ఈ `దేవ్`పైనే రకుల్ ఆశలు పెట్టుకుంది.
ఈ సినిమా హిట్టయితే, తెలుగులోనూ తమిళంలోనూ ఇంకొన్ని అవకాశాలు సంపాదించుకోవచ్చని రకుల్ ఆశ. ఇప్పటికే నవరతం కథానాయికల జోరు మధ్య.. రకుల్ కనిపించకుండా పోతోంది. మరో ఫ్లాప్ పడితే… తెలుగులో ఆమెని పట్టించుకునేవారే కనిపించరు. అందుకే ఈ సినిమాపై బాగా ఫోకస్ చేసింది. ఈ సినిమా కోసం వీలైనంత ఎక్కువగా ప్రమోషన్ చేసుకోవాలని చూస్తోంది. నిర్మాతలతో, టీమ్‌తో సంబంధం లేకుండా తన సొంత పీఆర్‌తో ఈ సినిమాకి పబ్లిసిటీ తెచ్చుకోవాలని ప్రయత్నిస్తోంది రకుల్. రజత్ రవిశంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈనెల 14న విడుదల అవుతోంది. మరి `దేవ్` రకుల్ జాతకాన్ని ఏమైనా మారుస్తుందేమో చూడాలి.