విజయ్ దేవరకొండ స్పీడు పెంచాడు. ఓ పక్క ‘డియర్ కామ్రేడ్’ సినిమాలో నటిస్తూ, మరోపక్క క్రాంతిమాధవ్ దర్శకత్వంలో కెయస్ రామారావు నిర్మిస్తున్న సినిమా షూటింగ్ మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఖమ్మం జిల్లా ఇల్లెందులో సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు.
సింగరేణి నేపథ్యంలో సాగే ఈ ప్రేమకథా చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన ముగ్గురు కథానాయికలు రాశీ ఖన్నా, ఐశ్వర్యా రాజేష్, ఇసబెల్లా నటిస్తున్నారు. ఇల్లెందు షెడ్యూల్లో ఐశ్వర్యా రాజేష్ పాత్రకు సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ పూర్తయింది. విజయ దేవరకొండతో పాటు ఆయన దర్శకుడు క్రాంతి మాధవ్ కూడా యమా స్పీడులో వున్నాడు.
‘ఆ నలుగురు’, ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ చిత్రాలతో దర్శకుడిగా క్రాంతిమాధవ్కు ప్రత్యేక గుర్తింపు, పేరు వచ్చాయి. కానీ, సునీల్ హీరోగా తీసిన ‘ఉంగరాల రాంబాబు’ సినిమా ఆ పేరుకు మచ్చ తీసుకొచ్చింది. మళ్లీ ఈ సినిమాతో తన మార్క్ చూపించాలని ఆయన ప్రయత్నిస్తున్నారు.