భారతీయ జనతా పార్టీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు… బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి అనే హోదాను.. ఎవరినైనా.. ఇష్టం వచ్చినట్లు విమర్శించడానికి ఇచ్చిన లైసెన్స్ గా భావిస్తున్నారు. ముఖ్యంగా ఏపీ విషయంలో ఆయన హద్దులు దాటి పోతున్నారు. తాజాగా ఆయన చంద్రబాబును అసెంబ్లీ రౌడీగా చెబుతూ.. ఓ ట్వీట్ చేశారు. పిచ్చి పీక్స్ కి చేరిందంటూ సినిమాల్లో కమెడియన్లు వాడే భాషను కూడా ఉపయోగించారు. అసెంబ్లీలో విష్ణుకుమార్ రాజు తీరుపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీకి అన్యాయం చేస్తున్నా.. బీజేపీని వెనకేసుకు రావడంపై.. మండిపడ్డారు. పౌరుషం లేదా అని విమర్శలు గుప్పించారు. ఆ తర్వాత విష్ణుకుమార్ రాజు సైలెంటయిపోయారు. చంద్రబాబు ఆగ్రహం… సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇదే జీవీఎల్ నరసింహారావుకు చిర్రెత్తుకొచ్చేట్లు చేసింది. వెంటనే ఆయన ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేసి.. చంద్రబాబు పై చెలరేగిపోయారు.
అయితే చంద్రబాబు ఆగ్రహం మాత్రమే వ్యక్తం చేశారు. ఎక్కడా అన్ పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడలేదు. ఎంత కోపం వచ్చినా.. . బీజేపీ నేతల్ని గారు అని గౌరవంగా సంబోధించి విధానపరంగా విమర్శించారు. కానీ.. మండలిలో ఉన్న ఇద్దరు బీజేపీ ఎమ్మెల్సీలు చేసిన.. రచ్చ అంతా ఇంతా కాదు. ఇష్టం వచ్చినట్లు వ్యక్తిగత విమర్శలు చేయడమే కాదు.. మండలిని కించ పరిచేలా వ్యవహరించారు. తీర్మానం పత్రాలను చించేశారు.
అసెంబ్లీలో టీడీపీ సభ్యులు వ్యవహరించిన విధం, మండలిలో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్సీలు వ్యవహరించిన విధం చూస్తేనే.. ఎవరు .. చట్టసభకు కనీసం గౌరవం ఇవ్వకుండా వ్యవహరిస్తున్నారో తేలిపోతుంది. వారికి కొత్తగా జీవీఎల్ తోడయ్యారు. తాము ఎన్ని మాటలయినా అనొచ్చు .. తమకు ఆ అధికారం ఉంది.. కేంద్రంలో అధికారలో ఉన్నాం.. కాబట్టి.. ఎలాంటి మాటలైనా అంటాం.. పడాల్సిందే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.
సీఎం చంద్రబాబు అసెంబ్లీలో బీజేపీ ఫ్లోర్ లీడర్ విష్ణుకుమార్ రాజుగారితో ప్రవర్తించిన తీరు చూస్తే "పిచ్చి పీక్స్" కు చేరినట్లు తెలుస్తోంది. మహా ఫ్రస్ట్రేషన్లో వున్న సీఎం "అసెంబ్లీ రౌడీ" లాగా ప్రవర్తించారు. సీఎంపై సభా హక్కుల ఉల్లంఘన నోటీస్ ఇచ్చే ఆలోచన.https://t.co/Py3PTKon91
— GVL Narasimha Rao (@GVLNRAO) February 1, 2019