అల్లు అర్జున్ అంత గొప్ప డ్యాన్సర్ కాదు అల్లు శిరీష్. కాని తనవంతుగా ప్రతి సినిమాలో స్టెప్పులు బాగా వేయడానికి కృషి చేస్తుంటాడు. మాస్ పాట ఒకటి తప్పకుండా తన చిత్రంలో వుండేలా చూసుకుంటాడు. మారుతి దర్శకత్వంలో నటించిన ‘కొత్త జంట’లో ‘అటు అమలాపురం.. ఇటు పెద్దాపురం’ సాంగ్ రీమిక్స్ చేశాడు. ప్రస్తుతం ‘ఎబిసిడి’ కోసం అటువంటి మాస్ మసాలా జానపద గీతాన్ని సిద్ధం చేస్తున్నాడు అల్లు శిరీష్.
మలయాళంలో దుల్కర్ సల్మాన్ నటించిన హిట్ సినిమా ‘ఎబిసిడి’ని తెలుగులో అదే పేరుతో రీమేక్ చేస్తున్నాడు అల్లు శిరీష్. చిత్రీకరణ చివరిదర్శకు చేరుకుంది. ప్రస్తుతం అమీర్ పేటలోని సారథి స్టూడియోస్ లో ఫోక్ సాంగ్ షూటింగ్ చేస్తున్నారు. ఈ సినిమాతో తెలుగులో పరిచయం అవుతున్న కన్నడ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ జూదా సాంధీ ఇచ్చిన మాస్ ట్యూన్ కు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందిస్తున్నారు. ఈ పాట కోసం ఓ స్పెషల్ సెట్ వేశారు.
అల్లు శిరీష్ సరసన ‘కృష్ణార్జున యుద్ధం’ ఫేమ్ రుక్సార్ థిల్లాన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి సంజీవ్ దర్శకుడు. ఎబిసిడి అంటే అమెరికన్ బార్న్ దేశి కన్ఫ్యూజ్డ్. అమెరికా నుంచి ఇండియా వచ్చిన ఒక ఎన్నారై కుర్రాడు ఇక్కడ ఎటువంటి కష్టాలు పడ్డాడనేది కథ.