ఆంధ్రప్రదేశ్ డీజీపీని వైఎస్అర్ కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేసింది. ఇప్పుడే కాదు.. చాలా రోజుల నుంచి ఆయనను.. టార్గెట్ చేసుకుని విమర్శలు గుప్పిస్తోంది. ఇప్పుడు ఈ విమర్శలు, ఆరోపణలను ఢిల్లీ స్థాయికి తీసుకెళ్లి.. ఎన్నికల సమయంలో.. ఆయన ఏపీ డీజీపీగా ఉండకూడదన్న లక్ష్యాన్ని సాధించాలనుకుంటోంది. ఇప్పటికే.. డీజీపీపై ఈ క్రమంలో.. అనేక ఆరోపణలు చేశారు. కోడి కత్తి కేసుపై.. జగన్మోహన్ రెడ్డి.. ఎన్‌ఐఏ విచారణకు పట్టుబట్టడం వెనుక.. డీజీపీ ఇమేజ్‌ను దిగజార్చాలన్న లక్ష్యమే ఉందని… ఉందని.. తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం ఉంద.. ఢిల్లీలో ఈసీని కలిసి… ఏపీ డీజీపీపై ఫిర్యాదు చేయబోతున్నారు. ఇందు కోసం ఒక రోజు ముందుగానే ఆయన హస్తినకు చేరుకున్నారు.
వైసీపీ ప్రధానంగా.. ఓట్ల గల్లంతు, నకిలీ ఓట్లపై.. ఫిర్యాదుకు అని చెబుతున్నా.. అసలు విషయం మాత్రం.. డీజీపీపై ఫిర్యాదుకేనని.. అంటున్నారు. గతంలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల అధికారిగా ఉన్న సిసోడియాను.. ఫిర్యాదుల మీద.. ఫిర్యాదులు చేశారు. కేంద్రంతో తమకు ఉన్న సన్నిహిత సంబంధాలతో… పదిహేను రోజుల కిందటే… ట్రాన్స్ ఫర్ చేయించారు. తెలంగాణలో ఎన్నికల అధికారిపై.. తీవ్రమైన ఆరోపణలు వచ్చినా… ఆయనను కొనసాగించిన కేంద్ర ఎన్నికల సంఘం… ఏపీలో మాత్రం.. సిన్సియర్‌గా పని చేస్తారని పేరున్న.. అధికారిని బదిలీ చేశారు. ఓట్ల జాబితాల్లో ఎలాంటి అవకతవకలను.. వైసీపీ నేతలు.. చూపించలేకపోయారు. ఎప్పటికప్పుడు ఆరోపణలే చేశారు. అయినప్పటికీ.. సిసోడియాను.. ట్రాన్స్ ఫర్ చేశారు. బీజేపీ నేతలతో సన్నిహిత సంబంధాలున్నాయని ఆరోపణలున్న అధికారాని ఆ స్థానంలో నియమించారు. ఆ తర్వాత సర్వేల పేరుతో .. ప్రైవేటు వ్యక్తులు ఓట్లు తలొగిస్తున్నారంటూ.. వైసీపీ నేతలు ఆరోపించారు.. అయితే.. అలా తొలగించిన ఒక్క ఓటుకు సంబంధించిన ఆధారం కూడా.. ఎన్నికల అధికారికి ఇవ్వలేకపోయారు.
ఇప్పుడు.. ఢిల్లీ పర్యటనలో.. ఈసీ ముందు జగన్మోహన్ రెడ్డి ఇవే ఆరోపణలు వినిపించనున్నారు. ఓటర్ల జాబితాల్లో అవకతవకలని చెప్పినప్పటికీ… డీజీపీని బదిలీ చేయాలని… జగన్మోహన్ రెడ్డి.. ఈసీకి గట్టిగా విజ్ఞప్తి చేసుకునే అవకాశం ఉంది. నిజానికి.. ఏ రాష్ట్రంలో అయినా .. ప్రత్యేకంగా.. ఆరోపణలు వచ్చి.. వివాదాస్పదం అయితేనే ఉన్నతాధికారుల్ని బదిలీ చేస్తారు. అందుకే… ఏపీ ప్రభుత్వానికి.. ఠాకూర్ అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ.. కోడికత్తి కేసు ద్వారా… ఆరోపణలు.. ఢిల్లీ స్థాయికి వివరించారు. ఇప్పుడు… ఆయన బదిలీ టార్గెట్ చేయబోతున్నారు. కేంద్రంలో ఉన్నది ఫ్రెండ్లీ ప్రభుత్వమే కాబట్టి… జగన్ కోరిక నెరవేరదని చెప్పడానికి అవకాశం లేదు.