కేంద్ర ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్లో అన్ని వర్గాలను సంతృప్తి పరిచినట్లుగా… మొదటగా విశ్లేషణలు వచ్చాయి. కానీ తరచి చూస్తే.. ప్రభుత్వం ప్రకటించిన అనేక అంశాల్లో లోటుపాట్లు, లోగుట్టు స్పష్టంగా తెలిసిపోతోంది. అలాంటి వాటిలో ఒకటి… కార్మికులకు పెన్షన్ పథకం. అసంఘటిత రంగంలోని కార్మికులకు నెలకు రూ. మూడు వేలు పెన్షన్ ఇచ్చేలా పథకం ప్రవేశపెట్టారు. కానీ ఇది ఎంత వరకు.. కార్మికులకు మేలు చేస్తుంది.
కార్మికుల కన్నా గోవులకే ఎక్కువ నిధులు కేటాయించారా..?
అసంఘటిత రంగంలోని కార్మికులకు నెలకు రూ. వంద రూపాయిలు కడితే.. అరవై ఏళ్ల తర్వాత నెలకు రూ. మూడు వేల రూపాయల పెన్షన్ ఇస్తామనే పథకాన్ని కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ప్రకటించింది. దీని ద్వారా పది కోట్ల మంది కార్మికులు లబ్దిపొందుతారని ప్రకటించారు. కానీ ఈ పథకానికి ప్రకటించిన రూ. 500 కోట్లు కేటాయించారు. ఈ ఐదు వందల కోట్లతో పది కోట్ల మందికి ఎలా లబ్ది చేకూరుస్తారు. అంటే.. ఒక్కొక్కరికి ఏడాదికి యాభై.. అంటే నెలకు రూ. 4. ఈ నాలుగు రూపాయలతో.. ఎలా కార్మికుల సంక్షేమం ఎలా చేస్తారు. ఇంకో విషయం ఏమిటంటే.. ఈ బడ్జెట్లో ఆవులకు రూ. 750 కోట్లు కేటాయించారు. గోవులకే అంత మొత్తం కేటాయించినప్పుడు.. పది కోట్ల మంది కార్మికులకురూ. 500 కోట్లు… కేటాయిస్తే.. ఏ విధంగా ప్రయోజనం కలుగుతుంది…? భారత ప్రభుత్వ బడ్జెట్ రూ. 28 లక్షల కోట్లు.. అందులో.. రూ. 500 ఎంత మొత్తం…?. ఇంత చిన్న మొత్తం కేటాయించి.. కార్మికుల జీవితాల్ని మార్చేస్తున్నామని చెప్పుకోవడం… ఎంత వరకు సమంజసం..!
ఇప్పటి నుంచి నెలకు రూ. 100 కడితే 35 ఏళ్ల తర్వాత రూ. 3 వేలు ఇస్తారా..?
కార్మికుల పెన్షన్ రూ. 3 వేలు రావాలంటే.. పాతికేళ్లకే.. నెలకు రూ. వంద చొప్పున కట్టడం ప్రారంభించాలి. అలా కట్టడం ప్రారంభిస్తే.. అరవై ఏళ్ల తర్వాత.. నెలకు రూ. 3 వేలు వస్తుంది. అంటే.. 35 ఏళ్ల తర్వాత.. నెలకు రూ. 3వేలు వస్తుంది. అంటే.. ముఫ్పై ఐదేళ్ల తర్వాత… రూ. 3వేలకు విలువ ఉంటుందా..?. ఈ రోజు వంద రూపాయలకు వచ్చినన్ని నిత్యాసవరాలు అప్పుడు.. రూ. 3వేలకు అయినా వస్తాయో రావో చెప్పలేం. దీని వల్ల బెనిఫిట్ ఉండదా.. అంటే.. ఉంటుంది. ఇప్పుడు… తెలుగు రాష్ట్రాల్లో… వృద్ధాప్య పించన్లు.. రూ. 2వేలు ఇస్తున్నారు. అరవై ఏళ్లకే ఇస్తున్నారు. ఇప్పుడు తగ్గిస్తున్నారు కూడా..! 57 ఏళ్లకే పెన్షన్ రూ. 2వేలు ఇస్తున్నారు. ఇది వచ్చే ఏడాదికి మూడు వేలు అయినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. దీనికి ఎలాంటి ప్రమియం కట్టాల్సిన పని లేదు. అయినా సరే.. ఇస్తున్నారు కదా..! అదే ఇప్పటి నుంచి రూ. వంద కట్టుకుంటూ పోతే.. 35 ఏళ్ల తర్వతా రూ 3వేలు ఇవ్వడం.. ఏమి లాభం. ఈ పెన్షన్ పథకం మంచిదే.. కానీ.. ఎందుకంత హైప్ క్రియేట్ చేయడం..?. ఆయుష్మాన్ భారత్ అనే పథకం ఒకటి పెట్టారు. యాబై కోట్ల మందికి రూ. ఐదు లక్షల ఆరోగ్య బీమా అన్నారు. కానీ దీనికి కేటాయించిన మొత్తం రూ. ఆరు వేలు ఐదు వందల కోట్లు. 50కోట్లకు మందికి నెలకు రూ. 10 రూపాయల చొప్పున కేటాయించారు. ఇదెలా సాధ్యం..? ఇస్తున్నదానికి… చెప్పిన దానికి చాలా తేడా వస్తోంది. అందుకే సమస్యలు వస్తున్నాయి.
చేసేది ఆవగింజంత.. చెప్పుకునేది గుమ్మడికాయంత..!
బడ్జెట్లో కేటాయించింది చాలా తక్కువ. చెప్పుకుంటోంది చాలా ఎక్కువ. రైతుకు నగదు సాయం విషయంలో కూడా అందే. రైతులకు.. ఐదు ఎకరాల్లోపు ఉన్న వారికి రూ.ఆరు వేలు సాయం చేస్తామన్నారు. అంటే.. ఎకరానికి నెలకు వంద రూపాయలు ఇస్తున్నట్లు లెక్క. అదే తెలంగాణలో.. ఎకరానికికి ఏడాదికి పది వేలు ఇస్తున్నారు. ఐదు ఎకరాలు ఉంటే.. రూ. యాభై వేలు వస్తున్నాయి. అంటే.. నెలకు ఎకరానికి రూ. ఎనిమిది వందలు ఇస్తోంది. అంటే.. కేంద్రం కన్నా రాష్ట్రం ఎనిమిది రెట్లు ఎక్కువ ఇస్తోంది. లెక్కలు తీస్తే.. రైతు కుటుంబానికి రోజుకు రూ. 17 రూపాయలు ఇస్తోంది. ఈ మాత్రం దానికే.. రైతుల జీవితాలే మారుతాయని.. వాతావరణాన్ని క్రియేట్ చేయడంపైనే విమర్శలు వస్తున్నాయి. 12 కోట్ల మందికి సాయం చేస్తున్నారు. కానీ.. ఈ సాయం.. వారికి ఎంత మొత్తంలో లభిస్తుందన్నదే కూడా చూడాలి. సాయం చేశారు కానీ బాగానే ఉంది కానీ.. ఎరువులు, విత్తనాలు, డీజీల్ ధరలు పెంచితే… ఆ సాయం కన్నా ఎక్కువే వారి దగ్గర వసూలు చేస్తున్నట్లవుతుంది. సమస్య అంతా.. కొద్దిగాచేసి ఎక్కువ చెప్పుకోవడంతోనే సమస్య వస్తోంది.