ఎన్నారై పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం.. హత్య కేసులో… మేనకోడలు శిఖాచౌదరి పాత్రే ఎక్కువని పోలీసులు అనుమానిస్తున్నారు. తాను జయరాంను చంపానని.. ఓ యాంకర్ ద్వారా ఫోన్ చేయించి.. ఇంటికి పిలిపించి… హత్య చేశానని రాకేష్ రెడ్డి చెబుతున్నారు. శిఖాచౌదరి కూడా.. చాలా విషయాలు చెప్పినప్పటికీ.. తనకు హత్య విషయం తెలియదని.. పోలీసుల దగ్గర బుకాయిస్తోంది. కానీ ఆమె చెబుతున్న వివరాలకు.. జరిగిన ఘటనలకు పొంతన లేకపోవడంతో.. పోలీసులు శిఖాచౌదరి వ్యవహారంపైనే పూర్తిగా దృష్టి కేంద్రీకరించి అసలు విషయాలు రాబడుతున్నట్లు తెలుస్తోంది.
శిఖాచౌదరికి అనేక మంది బాయ్ ఫ్రెండ్స్..!
శిఖాచౌదరి.. లైఫ్ స్టైల్ గురించితెలుసుకున్న పోలీసులు ఆశ్చర్యపోయారు. ఆమె రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు. ఇద్దరికీ విడాకులు ఇచ్చారు. పలువురితో డేటింగ్ చేశారు. ఒకరిద్దరితో పెళ్లి వరకూ వెళ్లారు. అలాంటి వారిలో రాకేష్ రెడ్డి కూడా ఒకరు. ప్రస్తుతం శ్రీకాంత్ అనే యువకుడితో డేటింగ్ లో ఉన్నారు శిఖా చౌదరి. అంతే.. కాదు.. హతుడు .. మేనమాన అయిన.. చిగురుపాటి జయరాంతోనూ.. తనకు శారీరక సంబంధం ఉందని.. అది తన వ్యక్తిగత విషయమని.. అందులో తప్పేమీ లేదని.. పోలీసుల ఎదుట ఆమె వాదించింది. అంతే కాదు.. జయరాం.. స్త్రీలోలుడు అన్నట్లుగా… పోలీసుల ముందు చెప్పుకొచ్చింది. ఆమె తీరు చూసిన పోలీసులు ఆశ్చర్యపోవాల్సి వచ్చింది. ఆమె లైఫ్ స్టైల్.. ఆమె ఖర్చులు.. ఆదాయం ఇతర విషయాలపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు జరుపుతున్నారు.
జయరాం వ్యాపారాల్లో ఆమె జోక్యం వల్లే కష్టాలు..!
చిగురుపాటి జయరాం.. ఎక్స్ప్రెస్ టీవీ పెట్టిన తర్వాత… శిఖాచౌదరి… ఆయన వ్యాపారాల్లోకి అడుగు పెట్టారు. వైస్ ప్రెసిడెంట్గా.. ఎక్స్ప్రెస్ టీవీలోకి అడుగుపెట్టిన తర్వాత.. జయరాం ఇతర వ్యాపారాల్లోనూ ఆమె స్థానం సంపాదించారు. అప్పట్నుంచే.. ఆమె పేరిట కొన్ని ఆస్తులు కూడా కొనుగోలు చేశారు జయరాం. కానీ.. ఆ డాక్యుమెంట్లు తన వద్దనే ఉంచుకున్నారు. ఎక్స్ప్రెస్ టీవీ మూత పడటానికి కూడా.. ప్రత్యక్షంగా శిఖాచౌదరినే కారణమని… ఆ సంస్థలో పని చేసిన వారు చెబుతూ ఉంటారు. ఇక్కడ వ్యాపారాల్లో శిఖాచౌదరి జోక్యం పెరిగిపోవడం.. నిధులన్నీ కరిగిపోతూండటంతో.. జయరాం భార్య.. ఖర్చులను కట్టడి చేశాయి. చెక్ పవర్ ఆమెకే ఉండటంతో.. ఎక్స్ ప్రెస్ టీవీకి నిధుల కటకట వచ్చింది. ఆ సమయంలోనే… కోట్లు ఖర్చు పెట్టి కార్లు.. విల్లాలు శిఖాచౌదరి కొన్నట్లు భావిస్తున్నారు.
బినామీ ఆస్తుల కోసమే చంపేశారా..?
రాకేష్ రెడ్డికి కోట్లు అప్పు ఇచ్చే స్థోమత ఉందా లేదా.. అన్న అంశంపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. హత్య చేసినట్లు.. అంగీకరించిన రాకేష్ రెడ్డి ఆర్థిక స్థోమతపై కూడా పోలీసులకు అనుమానాలున్నాయి. జయరాంకు… నాలుగున్నర కోట్లు అప్పు ఇచ్చేంత స్థోమత ఆయనకు లేదని భావిస్తున్నారు. శిఖాచౌదరి డేటింగ్ చేసినందున… ఆమె పేరుపై.. ఆస్తులు ఉన్నాయని… జయరాంను చంపేసి.. ఆ డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకుంటే… కోటీశ్వరులమైపోతామనే కుట్ర జరిగినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ దిశగా పరిశోధన జరుపుతున్నారు. మొత్తానికి.. ఈ వ్యవహారంలో విలన్గా శిఖాచౌదరినే ప్రత్యక్షంగా కనిపిస్తున్నారు.