వైఎస్ షర్మిల కేసులో.. తెలంగాణ పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై.. అనుమానాలు తలెత్తుతున్నాయి. ఆమె చేసిన ఫిర్యాదుపై.. పోలీసులు ఇప్పటి వరకూ.. రెండు అరెస్టులు చూపించారు. ఈ రెండు అరెస్టులకు పోలీసులు చెప్పిన కారణం… కేవలం.. కామెంట్లు చేయడం. ఎవరో వీడియోలు అప్ లోడ్ చేస్తే… ఆ యూట్యూబ్ వీడియోల కింద.. ఇద్దరు యువకులు కామెంట్లు మాత్రమే చేశారు. వారిలో గుంటూరుకు చెందిన యువకుడు.. ఎంసీఏ చదవుతున్నాడు. తెలంగాణలోని మంచిర్యాల జిల్లాకు చెందిన మరో యువకుడు.. క్షురకుడు. ఆయన కూడా కామెంట్లే చేశారు. కామెంట్లు చేసిన వారిని అరెస్ట్ చేసి పోలీసులు.. ఏం చెప్పాలనుకుంటున్నారు..?
ప్రభాస్‌తో అక్రమ సంబంధం అంటగట్టి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారనేది.. షర్మిల ఫిర్యాదు. ఆ ఫిర్యాదుకు ఆమె కొన్ని యూట్యూబ్ లింకుల అడ్రస్‌లు ఇచ్చారు. ఆ యూట్యూబ్ లింక్‌ల ఆధారంగా.. ఆ వీడియోలు ఎవరు అప్ లోడ్ చేశారు…ఏ ఐపీ అడ్రస్లల నుంచి అప్ లోడ్ చేశారన్నది తెలుసుకోవడం… గంటలో పని. అయినప్పటికీ.. పోలీసులు రోజుల తరనబడి నాన్చి.. యూట్యూబ్‌కు లేఖలు రాశామని.. మరో పనికి మాలిన కారణం చెబుతూ.. టైం పాస్ చేస్తూ వస్తున్నారు. అసలు అలా దుష్ప్రచారం చేసిన వీడియోలు ఉంటే… వారిని అరెస్ట్ చేయాల్సింది. కానీ.. వారి జోలికి పోకుండా… ఆ వీడియోలు కింద కామెంట్లు చేశారంటూ.. ఇద్దరు యువకుల్ని… అరెస్ట్ చేసి.. వారిని మీడియా ముందు అతి పెద్ద నేరస్తులుగా క్రియేట్ చేయడం ఎందుకు చేస్తున్నారో తెలంగాణ పోలీసులకే తెలియాలి..!
నిజానికి ఏదైనా పొలిటికల్ వీడియో వస్తే.. దాని కింద.. వచ్చే కామెంట్లన్నీ… అసభ్యకరంగానే ఉంటాయి. ఎవరూ.. ఎలాంటి పద్దతులు పాటించరు. ఆ విషయం అందరికీ తెలుసు. అలా కామెంట్ చేసినందుకే.. టార్గెట్‌గా పెట్టుకుని మరీ.. ఓ తెలంగాణ యువకుడ్ని… మరో ఆంధ్ర యువకుడ్ని మాత్రమే ఎందుకు అరెస్ట్ చేశారన్న విషయంలో క్లారిటీ లేకుండా పోయింది. ఈ విషయంలో తెలంగాణలో పోలీసులు రాజకీయ లక్ష్యాలను సాధించి పెడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎలాంటి కామెంట్లు పోస్టులు పెట్టకుండా… ఇతర రాజకీయ పార్టీల సానుభూతి పరుల్ని.. కట్టడి చేయడానికి.. షర్మిల కేసును ఉపయోగించుకుంటున్నారా… అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. గతంలో.. షర్మిల- ప్రభాస్‌కు సంబంధం అంటూ.. వీడియోలు అప్ లోడ్ చేసిన వారంటూ.. ఆరుగుర్ని అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు పెట్టారో లేదో తెలియదు. కానీ కొత్తగా కామెంట్లు చేసిన వారిని మాత్రం అరెస్ట్ చేశారు. ఇలా .. కామెంట్లు చేసే వారిని అరెస్ట్ చేయాల్సి వస్తే… లక్షల్లో తేలతారు..!