‘అవును! విజయవంతమైన మనిషి కంటే పెళ్లైన మనిషి చాలా సంతోషంగా వుంటాడు’ – ఇదీ యాంకర్ రవి ఆదివారం ఫేస్బుక్లో పెట్టిన కొటేషన్. కోట్తో పాటు ఫ్యామిలీ ఫొటో కూడా పోస్ట్ చేశాడు. తనకు పెళ్లైందని, మూడేళ్ల పాప వుందని ఇన్నాళ్లూ రహస్యంగా దాచిన నిజాన్ని బయటపెట్టాడు. ఫేస్బుక్లో ఈ పోస్ట్ చూశాక కొందరిలో కోపం కట్టలు తెంచుకుంది. రవిని బూతులు తిట్టడం ఒక్కటే తక్కువ. తెలుగులో వింత వింతగా తిడుతున్నారు. పోస్ట్ కింద కామెంట్స్ చూస్తే మతి పోతుంది. కొందరు రవిని ఓ మోసగాడిగా చూస్తున్నారు. కొందరు మాత్రం అతడికి మద్దతుగా కామెంట్స్ చేస్తున్నారు.
రవిపై ఇంత వ్యతిరేకత రావడానికి ఓ కారణం వుంది. అతడితో పాటు పలు కార్యక్రమాలకు యాంకరింగ్ చేసిన లాస్యతో ఎఫైర్ వుందంటూ అప్పట్లో పుకార్లు వచ్చాయి. అయితే.. లాస్య మరొకర్ని పెళ్లి చేసుకుంది. పెళ్లి తరవాత ఇచ్చిన ఇంటర్వ్యూల్లో రవికి పెళ్లైందని చెప్పింది. కొన్ని విషయాలు బయటపెట్టింది. అయితే… తనకు పెళ్లి కాలేదని రవి ఓ ఇంటర్వ్యూలో బుకాయించాడు. “నాకు పెళ్లి కాలేదని నిరూపిస్తే… మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా?” అని ఇంటర్వ్యూ చేసిన యాంకర్ని ఎదురు ప్రశ్నించాడు. అప్పట్లో రవి మాటలు నమ్మిన కొందరు లాస్యను తిట్టుకున్నారు. ఇప్పుడు వారంతా పశ్చాత్తాపడుతున్నారు. రవిని విపరీతంగా తిడుతున్నారు. వీటిపై రవి ఎలా స్పందిస్తాడో?