వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2003లో చేసిన పాదయాత్ర స్ఫూర్తిగా.. రూపొందిన సినిమా యాత్ర. ఆయన పాదయాత్ర చేయడానికి సంకల్పించిన పరిస్థితులేమిటి..? పాదయాత్రతో ఆయన సాధించిన విజయాలేమిటి..? ప్రజల కష్టాలు, కన్నీళ్లలలో ఆయన ఎలా భాగస్వామి అయ్యారు..? లాంటివాటిని.. ఇప్పుడు ప్రజలకు మరోసారి గుర్తు చేయడానికి సిద్ధం అయిన సినిమా యాత్ర. ట్రైలర్లు, డైలాగులతోనే ఆకట్టుకున్న “యాత్ర”… మమ్ముట్టి.. వైఎస్ పాత్రలో ఒదిగిపోవడంతో… క్రేజ్ అమాంతం పెరిగింది.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి … పదవిలో ఉన్న ఐదేళ్ల కాలంలో.. సంక్షేమ పథకాల్లో ఓ చరిత్రను సృష్టించారు. నేరుా ప్రజలకు లబ్ది చేకూర్చే పథకాలను ప్రవేశ పెట్టారు. ఉచిత వైద్యం అందించే ఆరోగ్య శ్రీ… అనేక మందికి ప్రాణదానం చేసింది. ఇక ఫీజు రీఎంబర్స్ మెంట్… కొన్ని లక్షల మంది పేద విద్యార్థులను.. ఉన్నత చదువులు చదువుకునేలా చేసింది. ఇలా.. దాదాపుగా ప్రతి వర్గానికి ఆయన పథకాలు లబ్ది చేకూరాయి. ఈ పథకాల రూపకల్పనకు పాదయాత్రలోనే స్ఫూర్తి కలిగిందని.. వైఎస్ తరచూ చెప్పేవారు. తన పాదయాత్రలో ఆయన ప్రజల కష్టాలు తెలుసుకుని… దాని ప్రకారమే.. వారి సమస్యలు తీర్చడానికి ఈ సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. ఇప్పుడీ యాత్ర సినిమా.. వాటన్నింటినీ మళ్లీ గుర్తు చేస్తోంది.
వైఎస్ సంక్షేమ పథకాల ద్వారా లబ్దిపొందిన వారు.. ఇప్పుడీ యాత్ర సినిమాకు… వైరల్ పబ్లిసిటీ తెస్తున్నారు. వైఎస్ వల్ల.. తాము ఎంతగా లాభపడ్డామో చెబుతూ.. ఎమోషనల్ అవుతున్నారు. వారి భావోద్వేగమే.. ప్రజల్లో వైఎస్ పట్ల .. పాదయాత్ర పట్ల ఎంత ..అభిమానం ఉందో.. ఇప్పటికీ నిరూపిస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతునన్నాయి. వైఎస్ చనిపోయి పదేళ్లు అవుతోంది. ఆయన పాదయాత్ర చేసి పదహారు ఏళ్లు అవుతోంది. అయినప్పటికీ..అది ఇంకా ప్రజల మనసుల్లో స్థిరంగా ఉండిపోయింది. ఇప్పుడు కొత్త తరానికి.. ఈ పాదయాత్ర గొప్పదనం కూడా… యాత్ర ద్వారా తెలుస్తుందన్న అభిప్రాయం…సినిమా యూనిట్ వ్యక్తం చేస్తోంది. ప్రజల్లో వస్తున్న స్పందన కూడా.. వారిని సంతోష పరుస్తోంది.