`రేయ్` డిజాస్టర్‌తో ఊసులోలేకుండా వెళ్లిపోయాడు వైవిఎస్ చౌదరి. ఈ సినిమాతో వైవిఎస్ దాదాపుగా రూ.20 కోట్లు నష్టపోయాడని, ఆస్తులు కూడా అమ్ముకోవాల్సివచ్చిందని టాలీవుడ్‌లో గుసగుసలు వినిపించాయి. అసలు ఈమధ్య వైవిఎస్ నుంచి ఎలాంటి అలికిడీ లేదు. దాంతో వైవిఎస్ సినిమాలు తీయడం మానేశాడనుకున్నారంతా. కానీ… గప్ చుప్‌గా ఓ సినిమాని తెరకెక్కించేందుకు రంగం సిద్ధం చేసేసుకుంటున్నారు. త్వరలోనే వైవిఎస్ మెగాఫోన్ పట్టబోతున్నాడని టాలీవుడ్ టాక్. ఇప్పటికే ఓ ప్రేమకథ సిద్ధం చేశాడట. ఈ సినిమాతో కొత్తవాళ్లని పరిచయం చేయబోతున్నాడని టాక్. ఈ చిత్రాన్ని తానే నిర్మిస్తాడా? లేదంటే నిర్మాత ఎవరైనా ఉన్నారా? అనేది తెలియాల్సివుంది. వైవిఎస్ కొత్తవాళ్లతో ఎప్పుడు సినిమా చేసినా హిట్లు కొట్టాడు. ఈసారీ అలానే టాలెంట్ హంట్ ద్వారా కొత్త హీరోని, కొత్త హీరోయిన్‌ని ఎంచుకోవాలని ప్లాన్ చేస్తున్నాడట. ఈసారైనా చౌదరికి హిట్టు తగులుతుందేమో చూడాలి.