బీజేపీయేతర రాష్ట్రాల్లో… అలజడి రేపి … పాలనా యంత్రాంగాన్ని అక్కడి ప్రభుత్వాలకు దూరం చేయడానికి బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు తీవ్ర స్థాయిలో జరుగుతున్నాయి. ఈ విషయంలో.. ఆంధ్రప్రదేశ్‌లో అధికారులను, పోలీసులను బెదిరించడానికి జీవీఎల్ నరసింహారావు సిద్ధమైపోయారు. కోల్‌కతాలో పోలీస్ కమిషనర్‌పై సీబీఐ దాడి, ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలను.. ఏపీ అన్వయించి.. ఏపీ పోలీసులను కూడా బెదిరించడం ప్రారంభించారు.. యూపీ బీజేపీ ఎంపీ… జీవీఎల్ నరసింహారావు. ఆంధ్రలోనూ రాజకీయ పోలీసులు ఉన్నారని.. కోల్‌కతా పరిణామాలతో వారి కళ్లు తెరుస్తాయని ఆశిస్తున్నారని.. నర్మగర్భ హెచ్చరికలతో.. ట్వీట్లు చేశారు. జీవీఎల్ వ్యాఖ్యలు కలకలం రేపే సూచనలు కనిపిస్తున్నాయి.
జీవీఎల్ వ్యాఖ్యలతో.. కోల్‌కతాలో.. సీబీఐ దాడులు చేసింది.. రాజకీయ కారణాలతోనే అన్న విషయం స్పష్టమవుతోంది. బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి విశ్వాసపాత్రుడైన అధికారి కాబట్టే ఆయను టార్గెట్ చేసినట్లుగా.. జీవీఎల్ చెప్పకనే చెప్పారు. ఇప్పుడు.. ఏపీ పోలీసుల్ని కూడా టార్గెట్ చేస్తామని.. ట్విట్టర్ ద్వారా బెదిరింపులకు దిగుతున్నారు. నిజానికి ఏపీలో ఆయన చెప్పిన రాజకీయ పోలీసులు ఎవరు ఉన్నారో కూడా ఆయన చెప్పాల్సి ఉంది. ఎందుకంటే… లా అండ్ ఆర్డర్ రాష్ట్ర ప్రభుత్వాల చేతుల్లోనే ఉంటాయి. అంటే.. పోలీసులు .. ప్రభుత్వ విధివిధానాల మేరకే పని చేస్తారు. ప్రభుత్వం చెప్పినవి.. చేయడం… రాజకీయం చేయడం అని జీవీఎల్ భావిస్తున్నట్లు ఉన్నారు. అంటే.. ఏపీ పోలీసులకు ఆయన ప్రభుత్వం చెప్పినవి చేస్తే.. సీబీఐ కేసులు ఎదుర్కొంటారని హెచ్చరించడం కావొచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఏపీ డీజీపీ ఠాకూర్‌పై ఇప్పటికే.. వైసీపీ నజర్ పెట్టి. ఆయనను… ఎన్నికల సమయంలో.. డీజీపీగా ఉంచకూడదన్న లక్ష్యంతో.. ఒక్కో అడుగు ముందుకేస్తున్నారు. అందుకే కోడికత్తి కేసులో… గంటలోనే ఆయన… దాడి చేసింది జగన్ అభిమాని అని చెప్పారని… దర్యాప్తు చేయకుండా ఎలా చెబుతారంటూ.. లాజిక్కులు లేని ప్రశ్నలు వేస్తూ కేంద్రానికి ఫిర్యాదు చేశారు. హక్కు లేకపోయినా… ఎన్ఐఏ దర్యాప్తునకు ఆదేశించారు. ఇప్పుడు అదే కేసును సాకుగా చూపి… ఎన్నికల సమయంలో.. ఠాకూర్‌ను డీజీపీగా తప్పించేందుకు ప్రయత్నిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో జీవీఎల్ బెదిరింపులు హైలెట్ అవుతున్నాయి. ఈ పరిణామం ఎటు తిరుగుతుందో చూడాలి..!
కోల్‌కతా పోలీస్ కమీషనర్ పై అనేక అభియోగాలు ఉన్నాయి. 2016 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇతగాడిని ఈసి తొలగించింది. గత వారం నిర్లక్ష్య ధోరణికి సంజాయిషీ అడిగింది. ఇటువంటి "రాజకీయ పోలీసులు" ఆంధ్రలో కూడా వున్నారు. కోల్‌కతా పరిణీమాలు వారి కళ్ళు తెరిపిస్తాయని ఆశిస్తాను.
https://t.co/lTZdVxoXdb— GVL Narasimha Rao (@GVLNRAO) February 4, 2019