ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఆర్పీ ఠాకూర్, ఇంటలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు, లా అండ్ ఆర్డర్ కోఆర్డినేషన్ హెడ్‌గా ఉన్న ఘట్టమనేని శ్రీనివాస్ సహా.. చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన డీఎస్పీలు, ఇతర అధికారులను .. ఎన్నికల విధుల నుంచి తప్పించకపోతే.. ఆంధ్రప్రదేశ్‌లో.. ఎన్నికలు ఫ్రీ అండ్ ఫెయిర్‌గా జరిగే అవకాశం లేదని… వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ప్రత్యేకంగా పేర్లు పెట్టి… చంద్రబాబు సామాజికవర్గం అధికారులు అంటూ.. ఓ జాబితా తయారు చేసి.. ఈసీకీ జగన్ అందించారు. చంద్రబాబు పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారని… చంద్రబాబు తన సామాజివర్గానికి చెందిన అధికారులకు మాత్రమే ప్రమోషన్లు ఇస్తున్నారని చెప్పుకొచ్చారు. పోలీసుల్ని ఉపయోగించుకుని… ఎన్నికల్లో చంద్రబాబు డబ్బులు పంచబోతున్నారని జగన్ ఆరోపించారు. ఇప్పటికే నియోజకవర్గాలకు డబ్బులు పంపించారని జగన్ చెబుతున్నారు. ఈ పోలీసులందర్నీ… తప్పించాల్సిందేనని.. ఈసీకి వినతి పత్రం అందించారు.
అలాగే.. నకిలీ ఓట్లు ఉన్నాయంటూ.. ఓ ఫిర్యాదును కూడా.. దీనికి జత చేశారు. ఏపీలో అరవై లక్షలకుపైగా నకిలీ ఓట్లు ఉన్నాయని.. డబుల్ ఓట్లు ఉన్నాయని…ఈసీకి ఇచ్చిన ఫిర్యాదులో జగన్ పేర్కొన్నారు. అలాగే… ఆర్టీజీఎస్ సహా… ఇతర ప్రైవేటు సంస్థలను .. సర్వేల పేరుతో.. వైసీపీ సానుభూతి పరుల్ని గుర్తించి.. ఓట్లు తొలగిస్తున్నారని.. ఆరోపించారు. దీనికి సంబంధించి ఆధారాలన్నీ… ఈసీకి ఇచ్చినట్లు జగన్ .. మీడియాకు తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వం… ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందన్నారు.
ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్.. ఓ సామాజికవర్గానికి చెందిన పోలీసు అధికారుల్ని మాత్రమే టార్గెట్ చేసి.. ఈసీకి ఫిర్యాదు చేయడం.. రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. పోలీసుల్లో అన్ని సామాజికవర్గాల వారూ ఉంటారు. ఇలా కేవలం.. ఒక సామాజికవర్గం మాత్రాన్నే.. ఎందుకు టార్గెట్ చేశారన్నది ఆసక్తికరంగా మారింది. పోలీసుల ప్రమోషన్లు అనేవి.. సీనియార్టీని బట్టి.. పనితీరును బట్టి వస్తాయి కానీ.. ఉన్నతాధికారులైనా… ఇష్టానుసారంగా ఇవ్వడానికి వీలు లేరు. అయినప్పటికీ.. ప్రమోషన్లకు.. సామాజికవర్గానికి లింక్ పెట్టి… వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా కలకలం రేపే అవకాశం కనిపిస్తోంది.