సక్సెస్‌లో ఉన్నప్పుడు ఎవరైనా కూల్‌గానే ఉంటారు… మరి ఫెయిల్యూర్ వచ్చినప్పుడు కూడా కూల్‌గా ఉండేవాళ్లే హీరోలు అనేది లేటెస్ట్ టాలీవుడ్ ట్రెండ్. తన సినిమా వినయవిధేయరామ ఫ్లాప్ అయిందని రామ్‌చరణ్ ఫ్యాన్స్ కి స్వయంగా చెప్పాడు . రామ్‌చరణ్‌తో క్లోజ్‌గా ఉండే అఖిల్ కూడా ఇప్పుడు అదే ఫార్ములాని ఫాలో అవుతున్నడు . అందుకే టెన్షన్‌తో కాకుండా కూల్‌గా అన్నిటినీ సెట్ చేసుకుంటున్నాడట. `అఖిల్`తో కెరీర్ మొదలుపెట్టిన అఖిల్ రెండో సినిమా `హలో` కలిసి రాలేదు. మూడో సినిమా, ఫ్యామిలీ మార్కు సినిమా `మిస్టర్ మజ్ను` గత రెండు చిత్రాల కన్నా ఫర్వాలేదనిపించుకున్నా పెద్దగా ఆడలేదు. సో ఇప్పుడు అఖిల్ టెన్స్ తో కాకుండా కూల్‌గా ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చాడు. ఆ నిర్ణయం పేరు ప్రభాస్. అవును.. అఖిల్ ఇప్పుడు ప్రభాస్‌తో కలిసి పనిచేయనున్నాడు . ప్రభాస్ అనగానే హీరో అనుకోకండి. దర్శకుడు. ప్రభాస్… ప్రభాస్ పినిశెట్టి… సత్య ప్రభాస్ పినిశెట్టి. ఆల్రెడీ తెలుగులో `మలుపు` అని ఓ స్క్రీన్ ప్లే బేస్డ్ సబ్జెక్ట్ డైరక్ట్ చేసిన దర్శకుడే సత్య ప్రభాస్ పినిశెట్టి. రవిరాజా పినిశెట్టి తనయుడు ఇతడు. `మిస్టర్ మజ్ను` ఫైనల్ స్టేజ్‌లో ఉన్నప్పుడే అఖిల్ ఇతని దగ్గర కథ విన్నాడు . ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి కావచ్చాయి. సో మార్చిలో సినిమా మొదలవుతుందని సమాచారం. అంటే శ్రీనువైట్ల దర్శకత్వంలోనూ, క్రిష్ డైరక్షన్లోనూ అఖిల్ సినిమా ఇమీడియేట్‌గా లేదన్నది సత్యం.