అతనో టాప్ స్టార్. పారితోషికం అందుకోవడంలోనూ, స్టార్ డమ్లోనూ తిరుగులేని కథానాయకుడు. అతనికో సరదా ఉంది. అప్పుడప్పుడూ పరిశ్రమలోని తన సన్నిహితుల్ని పిలిచి… ‘మందు’ పార్టీలిస్తుంటాడు. టాప్ హీరోతో మందు పార్టీ అంటే ఎవరు వదులుకుంటారు? పిలిస్తే చాలు.. వాలిపోతుంటారు. ఆ హీరో కూడా వీళ్లతో సరదాగానే ఉంటాడు. కావల్సినంత మందు.. వినడానికి బోలెడు కబుర్లు. పైగా… ఈ హీరోగారికి సెన్సాఫ్ హ్యూమర్ కూడా చాలా ఎక్కువ.
కాకపోతే.. ఆ హ్యూమర్ అప్పుడప్పుడూ హద్దు దాటుతూ ఉంటుంది. పక్క హీరోలపై సెటైర్లు వేస్తుంటాడు. ‘ఆ హీరో ఆ కథ చేస్తున్నాడట.. అవసరమా?’, ‘అసలు ఆ కాంబినేషన్ ఏంటండీ బాబూ..’ అంటూ… ఎకసెక్కాలు ఆడేస్తుంటాడు. హీరోగారు కామెడీ చేస్తే నవ్వాల్సిందే కదా? మందు పార్టీలో.. ఇలాంటి సెటైర్లే మంచింగులు. కాకపోతే… ఇలా మందు పార్టీలకు వచ్చిన ఒకరిద్దరు… ఈ కబుర్లని మిగిలిన హీరోల వరకూ మోసుకెళ్లార్ట. ‘వాడు నామీదే సెటైర్లు వేస్తాడా’ అంటూ ఆ హీరోలు కూడా తెగ రెచ్చిపోయి మాట్లాడేశార్ట. ఈ విషయం మందు పార్టీ ఇచ్చిన హీరోకీ తెలిసిపోయింది. మొత్తానికి పార్టీ పేరుతో.. ఒకర్నొకరు మోసుకోవడం, సెటైర్లు వేసుకోవడం మామూలైపోయింది. ‘నా మందు పార్టీకొచ్చి, నేను పోసిన మందు తాగి.. నేను చెప్పింది మోసుకెళ్తారా’ అంటూ హీరో ఫీలైపోవడం లేదు. సరికదా.. మందు పార్టీల సంప్రదాయాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడట. ఏం చెబుతాం లెండి. ఎవరి టైమ్ పాస్ వాళ్లది..!