సీనియర్ టాలీవుడ్ అగ్ర కథానాయకుడు విక్టరీ వెంకటేష్.. త్వరలోనే మామ కాబోతున్నారు. సినిమా పరంగా `వెంకీ మామ` ఈ నెలలో ప్రారంభం కానుందనే సంగతి తెలిసిందే. అయితే రియల్ లైఫ్‌లో వెంకటేష్ మామ అవతారం ఎత్తబోతున్నాడు. వెంకటేష్ కుమార్తె ఆశ్రిత దగ్గుబాటి .. హైదరాబాద్ రేస్ క్లబ్ చైర్మన్ ఆర్.సురేందర్ రెడ్డి మనవడు.. రఘురామరెడ్డి తనయుడుకి నిన్న హైదరాబాద్‌లోని వెంకీ నివాసంలో నిశ్చితార్థం జరిగిందని సినీ వర్గాల సమాచారం. ఈ వేడుకకు పరిమిత సంఖ్యలో బంధువులు, శ్రేయోభిలాషులు హాజరయ్యారట. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి రఘురామరెడ్డి సన్నిహితుడు. వీరి వివాహం మార్చి 1న జరగనుంది. అయితే ఏ వేదికపై వివాహం జరగాలనేది కుటుంబ సభ్యులు ఇంకా ఫిక్స్ కాలేదు. త్వరలోనే దానిపై ఓ క్లారిటీ రానుంది. అయితే రిసెప్షన్‌ను నానక్‌రామ్ గూడలోని రామానాయుడు స్టూడియోలో ఏర్పాటు చేస్తారట. మొత్తానికి రియల్ లైఫ్‌లో మార్చి 1న వెంకటేష్ మామ కాబోతున్నారు.