సూపర్‌స్టార్ మహేష్ టాలీవుడ్ అగ్ర కథానాయకుడనే సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈయన ఎం.బి.ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై శ్రీమంతుడు సినిమా నిర్మాణంలో భాగస్వామై నిర్మాతగా అవతారం ఎత్తారు. తర్వాత మరో సినిమాకు ఈయన నిర్మాణంలో సినిమాలేవీ రాలేదనుకోండి. ఆ విషయాన్ని పక్కన పెడితే ఇప్పుడు మహేష్ నిర్మాతగా మళ్లీ బిజీగా మారనున్నాడు. ఈయన నిర్మాణంలో ఓ వెబ్ సిరీస్ రూపొందనుందని వార్తలు వినపడుతున్న సంగతి తెలిసిందే. కాగా లెటెస్ట్ సమాచారం ప్రకారం మహేష్ నిర్మాతగా ఓ సినిమాను నిర్మించబోతున్నాడని సినీ వర్గాల టాక్. వివరాల్లోకెళ్తే .. గూఢచారితో సూపర్‌హిట్ కొట్టిన హీరో అడివిశేష్ హీరోగా.. గూఢచారి సినిమాను తెరకెక్కించిన శశికిరణ్ తిక్క దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుంది. మహేష్ శ్రీమతి నమ్రతా శిరోద్కర్ సినిమా ప్రొడక్షన్ వ్యవహారాలను దగ్గరుండి పర్యవేక్షనున్నారనేది సమాచారం. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన వివరాలు వెల్లడికానున్నాయట. అడివిశేష్ ఇప్పుడు `2 స్టేట్స్` సినిమాతో పాటు `గూఢచారి 2`లో బిజీగా ఉన్నాడు.