బోయపాటి శ్రీను-డివివి దానయ్య వ్వవహారం బిగుసుకునేలా కనిపిస్తోంది. ఇది హీరో రామ్ చరణ్ కు ప్రెస్టీజియస్ వ్యవహారంగా మారుతున్నట్లు కనిపిస్తోంది. దీనికి కారణం మరేం కాదు. ముగ్గురు మూడు అయిదులు ఇవ్వాలన్న ప్రతిపాదన చేసింది చరణ్ నే. ఎప్పుడు అయితే దానయ్య-బోయపాటి గొడవ బయటకు వచ్చిందో? మెగా క్యాంప్ పెద్దలు చిరంజీవి, అల్లు అరవింద్ రంగ ప్రవేశం చేసినట్లు తెలుస్తోంది.
డివివి దానయ్య మెగా క్యాంప్ కు అత్యంత సన్నిహితుడు కూడా. ఇలాంటి నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి రెండు విధాలుగా స్పందించినట్లు బోగట్టా. ఒకటి చరణ్ ను ఓ విషయంలో తప్పు పట్టినట్లు తెలుస్తోంది. వినయ విధేయ సినిమాను యువికి అమ్మించినది, యువిని రంగంలోకి దించినది రామ్ చరణ్ నే. అందువల్లే ఇప్పుడు ఈ 15 కోట్ల పంచాయతీ కూడా చరణ్ నెత్తిన వేసుకోవాల్సి వచ్చింది.
మెగాస్టార్ ఈ విషయంలోనే చరణ్ కు స్మూత్ గా క్లాస్ పీకినట్లు తెలుస్తోంది. అనవసరంగా సినిమా మార్కెటింగ్ లో జోక్యం చేసుకోవడం వల్లనే ఇదంతా వచ్చిందని, అదే దానయ్య మార్కెట్ చేసుకుని వుంటే, అతను చూసుకునేవాడని అన్నట్లు టాక్. ఇక రెండో విధమైన స్పందన ఏమిటంటే, ఎలాగైనా బోయపాటి మెడలు వంచి డబ్బులు కట్టించడం అన్నది.
ఆ బాధ్యత ను అరవింద్ కు అప్పగించినట్లు బోగట్టా. అరవింద్ తో బోయపాటి కాస్త మంచి సాన్నిహిత్యంతో వుంటారు. అందుకే ఆయనకు అప్పచెప్పారు. సిటింగ్ వేసి ఓప్పించే బాధ్యతను. ఎట్టి పరిస్థితుల్లోనూ డైరక్షన్ కు తీసుకున్న 15 కోట్లలో అయిుదు వెనక్కు ఇవ్వాల్సిందే అని నిర్మాత దానయ్య పట్టు పట్టి కూర్చున్నారు. రామ్ చరణ్ మాట కూడా అదే. మరి ఇంక అరవింద్ ఈ దిశగానే తన ప్రయత్నాలు చేయాల్సి వుంటుంది.
బోయపాటికి కష్టమే
ఇప్పుడు బోయపాటికి కష్టమే. ఇకపై మెగా హీరోలతో సినిమాలు వుండే అవకాశాలు చాలా తక్కువ. ఎన్టీఆర్ ఎప్పుడో దూరం. మహేష్ తో సినిమా అన్నది వార్తల్లోనే వుంటోంది. పైగా మరో రెండు మూడేళ్ల వరకు ఖాళీ లేదు ఆయనకు. ఇక బోయపాటికి బాలయ్య సినిమా తరువాత హీరోలు దొరకడం కష్టమే.
బోయపాటి రేంజ్ ఖర్చుకు గోపీచంద్,రామ్ లాంటి వాళ్లు చాలరు. ఇక ఎప్పటి నుంచో వినిపిస్తున్న అఖిల్ తోనో, మళ్లీ బెల్లంకొండతోనో చేసుకోవాల్సిందే.