తెలంగాణ మంత్రివర్గాన్ని 10న విస్తరించాలని కేసిఆర్ దాదాపుగా నిర్ణయానికి వచ్చినట్లు ప్రగతి భవన్ వర్గాలు చెబుతున్నాయి. ముహూర్తాలు.. సెంటిమెంటును బలం నమ్మే కేసిఆర్ ఈ ఆదివారం నేతల చేత ప్రమాణస్వీకారానికానికి ఏర్పాట్లకోసం ఆదేశించినట్లు తెలుస్తోంది. సిఎం గా కేసిఆర్ ప్రమాణస్వీకారం చేసి రెండు నెలల సమయం దగ్గరకొచ్చింది. కేసిఆర్ తోపాటు మహమ్మూద్ అలీ ఒక్కరు మాత్రమే కేబినెట్ ఉన్నారు. ఇటీవల అసెంబ్లి సమావేశాలకు ముందు కేబినెట్ సమావేశం ఈ ఇద్దరితోనే జరిగింది. ఈసారి అన్ని సమీకరణాలను, అన్ని వర్గాలను పరిగణలోకి తీసుకునే మంత్రివర్గ కూర్పు ఉంటుందని ఎన్నికల ఫలితాల మరుసటి రోజే కేసిఆర్ ప్రకటించారు.
అప్పటి నుండి విస్తరణ ఎప్పుడా అని.. అందులో తమకు చోటుంటుందా అని కళ్లల్లో వొత్తులేసుకుని ఎదురు చూస్తున్నారు గులాబీ నేతలు. సంక్రాంతికి కి ముందు పీడ రోజులు కాబట్టి మంచి రోజులు లేవన్న కారణంతో విస్తరణ వాయిదా వేస్తూ వచ్చారు.ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం జరుపలేదు. సంక్రాతి పండుగ మరుసటి రోజే అసెంబ్లీని ఏర్పాటు చేసి ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారాలు పూర్తి చేసి పోచారం శ్రీనివాస్ రెడ్డిని స్పీకర్ గా ఎన్నుకున్నారు. అప్పటి నుండి మళ్లీ మంత్రి వర్గ విస్తరణపై ఎప్పుుడుంటుందనే దానిపై ఊహాగానాలు మొదలయ్యాయి..పంచాయతీ ఎన్నికలు, పుష్యమాసం కారణంగా ఫిబ్రవరి మొదటి వారం వరకు మంచి ముహూర్తాలు లేవని చెప్తూ వచ్చారు. ఈ నెల నాలుగో తేదీతో పుష్యమాసం ముగిసి మాఘ మాసం మొదలైంది..దీంతో మళ్లీ మంత్రివర్గ విస్తరణపై ఊహాగానాలు మొదలయ్యాయి.
ఈ నెల పదో తేదీన మాఘ మాసం వసంత పంచమి మంచి ముహూర్తం ఉందని ఉదయం పదిన్నర నుండి సాయంత్రం 4 గంటలవరకు శుభఘడియలుండడంతో అదే రోజు 11 గం తర్వాత విస్తరణ ఉంటుందనే ప్రచారం జోరుగా సాగుతోంది.ఈ నెల 13న గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ వస్తుంది..అంతకంటే ముందు ఫిబ్రవరి 20 తర్వాత ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలున్నాయి.సభలో ఆర్థిక మంత్రి లేకుండా బడ్జెట్ ప్రవేశపెట్టడం సరిగాదని అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే ఆలస్యమైందని,ఇంకా విస్తరణ చేపట్టకుండా లోక్ సభ ఎన్నికలకు వెళ్లడం కూడా సరికాదనే అభిప్రాయం టిఆర్ఎస్ వర్గాల్లో వ్యక్తమవుతోంది…అందుకే ఎటు చూసినా ఈనెల 10నే మంత్రివర్గ విస్తరణ ఖాయమని చెప్తున్నారు.