కర్ణాటకలో మళ్లీ ఆడియో టేపుల కలకలం రేగింది. కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి. తమ ఎమ్మెల్యేలకు బీజేపీ నేతలు.. డబ్బులు ఎర జూపుతున్నారంటూ… ఓ ఆడియో టేపును విడుదల చేశారు. అందులో…ఒక ఎమ్మెల్యేకు.. రూ. 150కోట్లు నగదు, మంత్రి పదవి బీజేపీ నేతలు ఆఫర్ చేస్తున్నట్లుగా ఉంది. బీజేపీ నేత యడ్యూరప్ప కుమారుడు.. ఈ బేరసారాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. కొద్ది రోజులుగా.. కర్ణాటక భారతీయ జనతా పార్టీ నేతలు.. ఆపరేషన్ కమల పేరుతో… కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలను ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలను దారిలోకి తెచ్చుకున్నారు. వారు ఇప్పుడు సీఎల్పీ సమావేశాలకు, అసెంబ్లీకి హాజరు కావడం లేదు.
ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే లోపలే… కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోయాలనే ఆలోచనలో బీజేపీ ఉన్నట్లు తెలుస్తోంది. అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కన్నా… లోక్ సభ ఎన్నికల సమయంలో.. కాంగ్రెస్ పార్టీ కూటమి అక్కడ అధికారంలో ఉండకూడదన్న లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ ఉంది. దీని కోసమే.. అమిత్ షా.. నేతృత్వంలోనే స్కెచ్ వేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో.. బీజేపీ కార్యవర్గ సమావేశాలకు అని.. ఎమ్మెల్యేలు అందరూ ఢిల్లీకి వెళ్లారు. ఆ తర్వాత క్యాంప్‌కు వెళ్లిపోయారు. అదే సమయంలో.. కాంగ్రెస్‌కు చెందిన నలుగురు ఎమ్మల్యేలు ఆ పార్టీకి దూరం జరిగారు.
భారతీయ జనతా పార్టీకి.. కర్ణాటకలో గత ఎన్నికల్లో 17 పార్లమెంట్ సీట్లు వచ్చాయి. ఈ సారి కాంగ్రెస్ – జేడీఎస్ కలసి పోటీ చేస్తే… మెజార్టీ 12 సీట్లు గల్లంతవుతాయి. దక్షిణాదిలో పెంచుకోవాలనుకుంటోంది. కానీ దక్షిణాదిలో.. ఆ పార్టీకి బలం ఉన్న కర్ణాటకలో మాత్రమే. మిగిలిన రాష్ట్రాల్లో ఒక్క సీటు అయినా వస్తుందన్న గ్యారంటీ లేదు. అందుకే కర్ణాటకలో వీలైనన్ని ఎక్కువ సీట్లను సాధించాలన్న లక్ష్యంతో బీజేపీ ఉంది. ఈ లక్ష్యం సాధించాలంటే.. కాంగ్రెస్ – జేడీఎస్ కలసి పోటీ చేయకూడదు. ప్రభుత్వం ఈ రెండు ప్రభుత్వాన్ని నడుపుతున్నాయి కలసి పోటీ చేస్తాయి. అందుకే ప్రభుత్వాన్ని పడగొట్టాలనే ఆలోచన చేస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.