ప్రధానమంత్రి నరేంద్రమోడీ.. ఆదివారం గుంటూరుకు వస్తున్నారు. వస్తున్నారా .. లేదా అన్న అనుమానాల మధ్య ప్రధానమంత్రి పర్యటన ఖరారయింది. అయితే.. పరువు పోకుండా ఉండాలంటే.. వెళ్లక తప్పదన్నట్లుగా.. షెడ్యూల్ ఖరారు చేసారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ వచ్చేది పార్టీ కార్యక్రమాల కోసం కాదు.. లెక్క ప్రకారం అధికారిక కార్యక్రమాల కోసమే.. పదకొండు గంటల ఇరవై ఐదు నిమిషాలకు గుంటూరులోని ఏటుకూరు దగ్గర ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరవుతారు. మొత్తంగా పది నిమిషాల సేపు .. అంటు పదకొండు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకూ.. అక్కడ ఉంటారు. అందులో మొత్తం.. పది నిమిషాలు కార్యక్రమం. ఐదు నిమిషాల సేపు మాట్లాడటానికి సమయం కేటాయించారు. మిగతా ఐదు నిమిషాల్లో కానీ ఇది రాజకీయ కార్యక్రమం కాదు. షెడ్యూల్ ప్రకారం.. మోడీ కొన్ని ప్రాజెక్టులు ప్రారంభించడానికి వస్తున్నారు.
మోడీ శంకుస్థాపన చేయబోయే ప్రాజెక్టులేమిటంటే.. ఎక్కడో… వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న కృష్ణపట్నంలో బీపీసీఎల్ కోస్టల్ టెర్మినల్ కు.. ఏటుకూరులో మీట నొక్కి సంకుస్థాపన చేస్తారట. ఆ తర్వాత విశాఖలోని ఓఎన్జీసీకి చెందిన ఓ చిన్న ప్రాజెక్టు, ఐఎస్పీఆర్ఎల్ అనే మరో కేంద్ర సంస్థకు చెందిన మరో చిన్న ప్రాజెక్టుకు ఏటుకూరు నుంచే మీట నొక్కి ప్రారంభోత్సవాలు చేస్తారు. ప్రాజెక్టుల గురించి ఐదు నిమిషాలు మాట్లాడతారు. ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరుతారు. అయితే.. ఇదంతా అధికారికంగా.. మోడీ ఎపీలో ఎంట్రీ ఇవ్వడానికేనని తెలుస్తోంది. పార్టీ పరంగా.. ఓ బహిరంగసభ పెట్టారని.. దాన్ని అధికారికంగా మోడీ షెడ్యూల్ లో చేర్చలేదని చెబుతున్నారు.
అత్యంత లగ్జరీగా తయారు చేయింుకున్న బస్సులో బీజేపీ నేతలు ప్రారంభించిన యాత్రను.. ప్రజలెవరూ పట్టించుకోవడం లేదు. బస్సుయాత్ర ప్రారంభానికి వచ్చిన అమిత్ షానూ ఎవరూ పట్టించుకోలేదు. దీంతో.. ఏపీలో నరేంద్రమోడీ పర్యటన ఉంటుందా లేదా.. అన్న చర్చ ప్రారంభించింది. బీజేపీ కూడా దీనిపై పెద్దగా.. ప్రచారం చేయలేదు. కానీ.. మోడీ మాత్రం పది నిమిషాల టూర్ కోసం ఏపీకి వస్తున్నట్లు అధికారిక ప్రకటన విడుదలయింది.