ప్రభాస్ అభిమానులకు కచ్చితంగా ఇది శుభవార్తే. బాహుబలి తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సినిమా సాహో. ఇప్పటివరకు ఈ సినిమా పోస్టర్ సరైనది ఒక్కటి కూడా బయటకు రాలేదు. వచ్చిన ఒకే ఒక్క పోస్టర్లో ప్రభాస్ ముఖం సరిగా కనిపించదు. సరైన పోస్టర్ ఎప్పుడు బయటకు వదులుతారా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. త్వరలో ఈ ఎదురుచూపులకు తెరపడుతుంది.
సాహో పోస్టర్స్ కోసం ఈరోజు స్పెషల్ షూట్ చేశారు. హీరోయిన్ శ్రద్ధా కపూర్ కూడా ఈ షూటింగ్ లో పాల్గొంది. త్వరలో ఈ పోస్టర్స్ విడుదల చేస్తార్ట. అన్నట్టు… సాహో పోస్టర్ షూట్ పార్ట్ వన్ ఈరోజు జరిగింది. మళ్లీ మరోసారి పోస్టర్స్ కోసం స్పెషల్ ఫుడ్ ప్లాన్ చేశార్ట.
ఈ చిత్రానికి బాహుబలి తరహా లో మూడు నాలుగు నెలల ముందు నుంచి ప్రమోషన్లు చేయాలనుకుంటున్నారు… బాలీవుడ్ స్టైల్ లో! సాహో సినిమాను తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం భాషల్లో విడుదల చేయనున్న సంగతి తెలిసిందే. బాహుబలి తర్వాత ప్రభాస్ నుంచి వస్తున్న సినిమా కాబట్టి భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. ప్రచారం కోసం దేశంలో ప్రధాన నగరాలు అన్నిటినీ చుట్టేయాలని సన్నాహాలు చేస్తున్నారు. సుజిత్ దర్శకత్వంలో యువి క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్, విక్రమ్ నిర్మిస్తున్న ఈ సినిమా ఆగస్టు 15న విడుదల కానుంది.