రోజుల తరబడి సినిమాలో చెక్కను దర్శకుడు పూరీ జగన్నాథ్ డిక్షనరీలో లేదు. ఒక్కసారి షూటింగ్ మొదలైందా… యూనిట్ అంతా పరుగులు పెట్టాల్సిందే. చకచకా సన్నివేశాలను తీసుకుంటూ వెళ్తాడు పూరి.
రామ్ హీరోగా తెరకెక్కిస్తున్న ఇస్మార్ట్ శంకర్ సినిమా షూటింగునూ చక చకా చేసేస్తున్నాడు పూరి జగన్నాథ్. ప్రస్తుతం ఈ సినిమా కోసం ఒక ఫైట్ తీస్తున్నాడు. రియల్ సతీష్ కంపోజ్ చేస్తున్న ఈ ఫైట్ ని హైదరాబాద్ లోని ఒక ఫ్యాక్టరీలో తీస్తున్నారు. పూరి మార్క్ స్టైల్ లో ఈ ఇస్మార్టు ఫైట్ వుంటుందని యూనిట్ టాక్.
హీరోయిన్లుగా సవ్యసాచి మిస్టర్ మజ్ను ఫేమ్ నిధి అగర్వాల్, నన్ను దోచుకుందువటే ఫేమ్ నభ నటేష్ నటిస్తున్న ఈ సినిమాను సమ్మర్ సీజన్ లో రిలీజ్ చేయాలనేది పూరి ప్లాన్. ఈ చిత్రానికి మణిశర్మ సంగీత దర్శకుడు.