వచ్చే ఏడాది మన దేశంలో ఎన్నికల వేడి రాజుకోనుంది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో లోక్‌సభ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికలు ఉన్న రాజకీయ పార్టీలకు, కొత్తగా స్థాపించబడ్డ రాజకీయ పార్టీలకు టెన్షన్‌ను క్రియేట్ చేసేవే. ఇక ఆంధ్రప్రదేశ్‌లో పవన్ హవా ఏ మాత్రమే ఈ ఎన్నికలకు ప్రత్యక్షంగా అవగతం కానుండగా.. తమిళనాటు కమల్ హాసన్ రాజకీయ పార్టీ రేంజ్‌ను కూడా ఈ ఎన్నికలు నిర్ణయించబోతున్నాయని రాజకీయ వర్గాల టాక్. ఎందుకంటే.. ఈ ఎన్నికల్లో లోక్‌సభ తరపున కమల్ అతని పార్టీకి చెందినవారు 40 స్థానాల్లో పోటీ చేయబోతున్నారని సమాచారం. కమల్‌హాసన్ ఏ లోక్‌సభ నుండి పోటీ చేయబోతున్నారనేది త్వరలోనే నిర్ణయం కానుంది. అంటే కమల్‌హాసన్ ఎమ్మెల్యే కంటే ముందుగా లోక్‌సభకు పోటీ చేయబోతున్నారన్నమాట. మరి కమల్ హవా ఎంత మాత్రం ఉంటుందో వేచి చూడాల్సిందే..