బన్నీ దగ్గర ఏడాది పాటు కథ మీద కసరత్తు చేసి, ఆఖరికి ఒప్పించలేక, నాని దగ్గరకు వెళ్లిపోయాడు దర్శకుడు విక్రమ్ కే కుమార్. అక్కడ యాభై కోట్ల బడ్జెట్ అవసరం అయ్యే కథ చెప్పాడని, దానిని నాని ఓకె చేసారని టాక్ బయటకు వచ్చింది.
అయితే అందుతున్న సమాచారం, వినిపిస్తున్న గుసగుసల మేరకు బన్నీ కోసం చేసి, ఆయనను ఒప్పించలేకపోయిన కథనే నాని దగ్గరకు తీసుకెళ్లాడని తెలుస్తోంది. ఈ సినిమాలో నాని రచయితగా కనిపిస్తాడని వినికిడి. సరైన నవల రాసి పేరు తెచ్చుకోవాలని దాదాపు ఏడెనిమిది నవలలు రాసిన తరువాత ఒక కుటుంబం లేదా ఓ బృందం ఓ సహాయం కోరి నానిని కలుస్తారని, అప్పుడు జరిగిన కథే సినిమా అని తెలుస్తోంది.
మొత్తం మీద వైవిధ్యమైన కథే తయారుచేసినట్లుంది విక్రమ్ కే కుమార్. మరి బన్నీకి ఎందుకు నచ్చలేదో? ఎక్కడ నచ్చలేదో? ఇప్పటి దాకా తన సినిమాల్లో రివెంజ్ ఫార్ములాను టచ్ చేయని విక్రమ్ కుమార్ ఈ సినిమాలో దాన్ని కూడా టచ్ చేస్తున్నాడని టాక్ వినిపిస్తోంది.